వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియాంకరెడ్డిపై అత్యాచారానికి పాల్పడింది నలుగురు కాదని ఐదుగురని తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ప్రియాంకరెడ్డి కేసులో ఐదో వ్యక్తి ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారని ఐదో నిందితుడు నారాయణ పేట జిల్లా పొర్లకు చెందిన యువకుడని సమాచారం. 
 
రెండు పోలీసు బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయి. ప్రియాంక మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర కొందరు నినాదాలు చేసుకుంటూ స్టేషన్ లోకి వచ్చేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు మెడికల్ ఎగ్జామిన్ తరువాత నిందితులను షాద్ నగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిందితులను ఉరితీయాలన్న డిమాండ్ పెద్దఎత్తున వినబడుతోంది. 
 
ప్రియాంకరెడ్డి హత్య కేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు తల్లి జయమ్మ ప్రియాంకను ఎలా చంపారో తన కొడుకును అలానే చంపినా పరవాలేదని చెప్పారు. తన కొడుకు చెన్నకేశవులు ఇలాంటి పని చేశాడని తెలియడంతో తన భర్త ఆత్మహత్యకు యత్నించాడని జయమ్మ మీడియాకు తెలిపారు. తన కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఏమీ అనలేదని, తన కొడుకుకు కిడ్నీ పాడైందని మహ్మద్ షాషాతో స్నేహం తరువాతే తన కొడుకు చెడిపోయాడని 
 జయమ్మ చెప్పారు. చెన్నకేశవులు భార్య గర్భవతి అని తెలుస్తోంది. 
 
నాకు కూడా ఆడపిల్లలు ఉన్నారని నా కొడుకును ఉరి తీయండి లేదా కాల్చి చంపండని జయమ్మ చెప్పారు. మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ లాయర్లు ఎవరూ కూడా నిందితులకు సహాయం చేయకూడదని నిర్ణయం తీసుకుంది. లాయర్లు నిందితులకు కఠినంగా శిక్ష పడే విధంగా న్యాయపోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రియాంక రెడ్డిని నిందితులు పక్కా స్కెచ్ తోనే హత్య చేశారని మద్యం మత్తులో నలుగురు యువకులు ఈ ఘోరానికి పాల్పడ్డారని పోలీసులు తేల్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: