ఈ ఏడాది మే 30వ తేదీన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేశారు. రికార్డు స్థాయి గెలుపుతో ఆయ‌న‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. జ‌గ‌న్ త‌న ఆరునెల‌ల పాల‌నలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 80 శాతం వరకూ అమలు చేసి చరిత్ర సృష్టించార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెర‌వేర్చి...ఓట్ల రాజ‌కీయం కోసం ఎన్నిక‌ల ముందు పథ‌కాలు ప్ర‌క‌టించే వారికి తాను భిన్న‌మ‌ని నిరూపించారంటున్నారు. 

 

జ‌గ‌న్ స‌ర్కారు ముఖ్యమైన పథకాలు– నిర్ణయాలు

1) ‘వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’
ప్రారంభం: అక్టోబరు 15, 2019
వేదిక       : నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం కాకుటూరు

రైతులకు సాగు పెట్టుబడి కింద ఏటా రూ.13,500 చొప్పున 5 ఏళ్లలో మొత్తం రూ.67,500 ఆర్థిక సహాయం.
– రాష్ట్ర వ్యాప్తంగా 45.82 లక్షల మంది రైతులకు చెల్లింపులు పూర్తి 
– మరో 2.14 లక్షల మంది రైతులకు వారం రోజుల్లోగా చెల్లించాలని సీఎం ఆదేశం.
– మొత్తంగా 48 లక్షల మంది రైతులకు భరోసా.   
– ప్రభుత్వం రైతులకిస్తున్న డబ్బును బ్యాంకర్లు పాత అప్పుల కింద జమచేయడానికి వీలు లేకుండా అన్‌ ఇంకబర్డ్‌ ఖాతాల్లో జమ.

– గ్రామ సచివాలయాల్లో రైతులకు అందుబాటులో నాణ్యమైన పురుగు మందులు, విత్తనాలు. వర్క్‌షాపుల్లో రైతులకు శిక్షణ. 
– రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో విత్తన, ఎరువుల పరీక్ష కేంద్రాలు.
– రూ.4 వేల కోట్లతో (కేంద్ర, రాష్ట్రాలు కలిపి) ప్రకృతి వైపరీత్యాల నిధి, అగ్రి కమిషన్, ఆయిల్‌పాం రైతులకు గిట్టుబాటు ధర కోసం నిధుల కేటాయింపు,
– కౌలు రైతుల కోసం సాగుదారుల హక్కుల బిల్లు, 
– పంటల బీమా ప్రీమియమ్‌ చెల్లింపు
పంటల బీమా కోసం 55 లక్షల రైతుల తరపున 56 లక్షల హెక్టార్ల భూమికి సంబంధించి రూ.2164 కోట్లు ప్రీమియమ్‌గా చెల్లింపు
– రైతులు నామమాత్రంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే ప్రీమియమ్‌గా వసూలు.

– ధాన్యం సేకరణలో గత ప్రభుత్వం రూ.960 కోట్లు బకాయి పెడితే, ఆ మొత్తాన్ని ఈ ప్రభుత్వం తీర్చేసింది. 
– శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాలుకు రూ.1500 చొప్పున రూ.330 కోట్లు, సహాయం. పామాయిల్‌ రైతులకు రూ.87 కోట్లు ఇచ్చి అండగా నిల్చారు.
– ఆవులు, గేదెలు, మేకలు గొర్రెలు చనిపోతే బీమా పరిహారం చెల్లింపు
వ్యవసాయానికి వినియోగించే ట్రాక్టర్లకు రహదారి పన్ను రద్దు.
– ఉచిత పంటల, పశు బీమా, గత ప్రభుత్వ ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయి రూ. 2 వేల కోట్లు విడుదల, ఇన్‌పుట్‌ సబ్సిడీ 15 శాతం పెంపు
– వ్యవసాయ ల్యాబ్‌లు, ఉచిత బోర్లు, ప్రతి నియోజకవర్గానికి ఒక బోర్లు వేసే రిగ్గు. మొత్తం 200 రిగ్గులు
– పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌
ఆక్వా రైతులకు యూనిట్‌ రూ.1.50కే కరెంట్‌ సరఫరా. ఇందు కోసం రూ.720 కోట్లు విడుదల. మొత్తం 53,550 మంది ఆక్వా రైతులకు ప్రయోజనం
– ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షల పరిహారం, 
– రైతులకు వడ్డీ లేని రుణాలు, చిరుధాన్యాల బోర్డు ఏర్పాటు.

 

 

 

2) గ్రామ సచివాలయాలు–ఉద్యోగాల విప్లవం:

ప్రారంభం: అక్టోబరు 2, 2019

వేదిక       : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ కరప  

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా.. రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు. 
– ప్రజల పనులు/సమస్యలు 72 గంటల్లో పరిష్కారమయ్యేలా గ్రామ, వార్డు సచివాలయాలు .
– పూర్తి పారదర్శకంగా, అవినీతికి అవకాశం లేకుండా 20 లక్షల మందికి పరీక్షలు సజావుగా నిర్వహణ. 
– నాలుగు నెలలు నిండకుండానే 4.10 లక్షల ఉద్యోగాల కల్పన
–ఇందులో గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.40 లక్షల శాశ్వత ఉద్యోగాలు. 
 గ్రామ వలంటీర్‌ ఉద్యోగాలు 2.75 లక్షలు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్‌.
– 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి దాదాపు 500 రకాల సేవలను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ సచివాలయాల ద్వారా పూర్తి స్థాయిలో అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 

 


3) దశల వారీ మద్యపాన నిషేదం..

– మహిళల జీవితాల్లో చిచ్చు పెడుతూ.. పేదవర్గాలను ఛిదిమేస్తోన్న మద్యం మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమేసేందుకు దశలవారీగా మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నాం. 
– తొలి ఏడాదే 20 శాతం మద్యం షాపులను తగ్గించి.. సర్కారీ మద్యం షాపులను తెచ్చాం.
– మద్యం అందుబాటులో ఉండే సమయాల్లో కోతలు విధించాం. 
– చంద్రబాబు పాలనలో రాష్ట్రం మొత్తమ్మీద 4,380 ప్రయివేట్‌ మద్యం షాపులు ఉంటే... వీటి స్థానంలో 880 తగ్గించి 3,500 ప్రభుత్వ మద్యం షాపులు ఏర్పాటు చేశారు. 
– చంద్రబాబు హయాంలో ఉన్న 44వేల బెల్టు షాపులను పూర్తిగా తొలగించాం. 
– మద్యం ముట్టుకుంటేనే షాక్‌ కొట్టేలా నిర్ణయాలు.. త్వరలో నూతన మద్యం విధానం అమలు.
–  బార్లకూ నూతన విధానం.. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న బార్లలో 40 శాతం తగ్గింపు
– గతంలో  మొత్తం 797 బార్‌ షాపులు ఉంటే.. వాటిని 487కు తగ్గించడం. జనవరి 1 నుంచి నూతన బార్ల విధానం అమలు.  
–నూతన మద్యం షాపుల పాలసీ వల్ల... గత 2018 అక్టోబరుతో పోలిస్తే 2019 అక్టోబరు నాటికి.. ఆల్కహాల్‌ వినియోగం 25 శాతం పైన తగ్గింది. బీర్లు వినియోగం 55 శాతం పైన తగ్గింది.
– రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే నిర్వహించే మద్యం దుకాణాల్లో 3,500 మంది సూపర్‌వైజర్లు, 8,033 మంది సేల్స్‌మెన్‌ల నియామకం ద్వారా ఉపాధి కల్పన.

 


4)  వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ: 

– వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు కుటుంబాలకు వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు.
హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఎక్కడ వైద్యం చేయించుకున్నా పథకం వర్తింపు.  
– చికిత్స చేయించుకున్న తర్వాత విశ్రాంతి సమయంలో నిపుణుల కమిటీ సూచన మేరకు రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలు ఆర్థిక సహాయం.  
– డయాలసిస్‌ చేయించుకునే వారు, తలసేమియా, సికిల్‌సెల్, హీమోఫీలియా బాధితులకు నెలకు రూ.10 వేల పింఛన్‌. ప్రమాదాల కారణంగా, పక్షవాతం వల్ల, తీవ్రమైన కండరాల క్షీణత 
వల్ల మంచానికే పరిమితమైన వారికి, బోధకాలు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు (స్టేజ్‌ 3,4,5) నెలకు రూ.5 వేల పింఛన్‌. కుష్టు వ్యాధిగ్రస్తులకు రూ.3 వేల పింఛన్‌.  
– కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ‘నాడు – నేడు’ కింద ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధి, ఇందుకు రూ.1,500 కోట్లు కేటాయింపు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి రూ.1,740 కోట్లు కేటాయింపు.  
– సుమారు 3.5 కోట్ల మందికి లబ్ధి. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 936 వ్యాధులు. మొత్తంగా 2,031 వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తింపు. 
– దేశంలోనే తొలిసారిగా.. చికిత్స చేయించుకున్న తర్వాత విశ్రాంతి సమయంలో ఆర్థిక సహాయం. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన 48 గంటల్లో రోగుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఇది వర్తింపు. డిసెంబరు 1 నుంచి ఆరోగ్యశ్రీ కింది శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్ధిక 
సహాయం కింద రోజుకి రూ.225లు చొప్పున.. ఇలా నెలకు గరిష్టంగా రూ.5వేలు రికవరీ కాలాని ఇస్తారు.
– 40 రోజులు ఆసుపత్రిలో ఉంటే 30 రోజులకు రూ.5 వేలు, మిగతా 10 రోజులకు రోజుకు రూ. 225 చొప్పున ఇస్తారు. మొత్తం 40 రోజులకు రూ. 7,250 ఇస్తారు. 
–ఈ మొత్తం రోగి బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. 
– డిసెంబరు 1 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుంది. 

 


5) వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక: 

–  వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు గత ప్రభుత్వం హయాంలో ఎన్నికల ముందు కొద్ది నెలల వరకూ.. కేవలం రూ. 1000 ఉన్న సామాజిక పింఛన్‌ మొత్తాన్ని ఏకంగా రూ. 2,250కు పెంచారు. 
– రాబోయే 5 ఏళ్ళలో ఈ పింఛన్‌ ను రూ. 3 వేలుకు పెంచుకుంటూ వెళతారు. – మే నెల 30న సీఎంగా వైఎస్‌ జగన్‌ గారు ప్రమాణం చేసిన వెంటనే.. సామాజిక పెన్షన్లను రూ.2250 పెంచుతూ తొలి సంతకం చేశారు.
–  వృద్ధుల పెన్షన్‌ వయస్సు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించారు.
– వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పథకం కింద వృద్ధులకు రూ. 2,250, వికలాంగులకు రూ. 3 వేలు పింఛన్‌.

 


6)  జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన :
జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన
– జగనన్న విద్యా దీవెన పథకం కింద పేద విద్యార్థులు ఏ చదువు చదివినా పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌. 
– జగనన్న వసతి దీవెన పథకం కింద 2019–2020 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి విద్యార్థికి ఆహారం, వసతి ఖర్చుల కోసం ఏడాదికి రూ.20 వేలు అందజేత.  
– ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలకూ వర్తింపు.  
– ఈ పథకాల కింద 11.44 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి, రూ.5668 కోట్లు కేటాయింపు. 

 

7) సామాజిక మార్పే లక్ష్యంగా అడుగులు

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం పదవులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే  నవశకానికి శ్రీకారం చుట్టారు. 
– ఇందులో ఆ వర్గాల నుంచి ముగ్గురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. 
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం.
 – శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రంలో బీసీ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ చట్టం. 
– ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం. 
– ప్రభుత్వ నామినేటెడ్‌ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం. 
తిరుమల తిరుపతి దేవస్థానం మినహా.. ఆలయ పాలక మండళ్ళలో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు.

 


8) మన బడి నాడు–నేడు
తేదీః 14.11.2019

వేదికః ఏలూరు, పీవీఆర్‌ గ్రౌండ్స్‌లో పథకం ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌
– మనబడి నాడు–నేడులో భాగంగా 45 వేల 512 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.12 వేల కోట్లు కేటాయింపు. 
– తొలి దశలో 15,715 పాఠశాలల్లో 9 రకాల సౌకర్యాలతో అభివృద్ధి. 
– ప్రస్తుతం పాఠశాలల ఫొటోలు తీసి.. అభివృద్ధి చేశాక ఫొటోలతో తేడా చూపుతారు.
– ప్రభుత్వ స్కూళ్లలో రన్నింగ్‌ వాటర్‌తో కూడిన టాయిలెట్లు, తాగు నీరు, ట్యూబ్‌ లైట్లు, ఫ్యాన్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి అవసరమైన క్వాలిటీ ఫర్నీచర్, తరగతి గదులకు 
అవసరమైన మరమ్మతులు, అదనపు తరగతి గదులు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ప్రహరీలు, గోడల ఫినిషింగ్, పెయింటింగ్, ఇంగ్లిష్‌ ల్యాబ్‌ల వంటి కనీసం 9 రకాల సదుపాయాలు కల్పిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: