ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న‌మోహ‌న్ రెడ్డి ఆరునెల‌ల పాల‌న ప్రజారంజ‌కంగా ఉంద‌నే పేర్కొంటున్న‌ప‌టికీ...రాబోయే కాలంలో ఏ విధంగా ఆయ‌న స‌ర్కారు ఉండనుంది. రానున్న రోజుల్లో ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోనున్నార‌ని పలువురు చ‌ర్చించుకుంటున్నారు. వైసీపీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం త్వ‌ర‌లో అమలులోకి వచ్చే పథకాలు–నిర్ణయాలు ఇవి...

 

1). అమ్మ ఒడి (జనవరి 9న ప్రారంభం) 
– ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున సాయం.  
– 45 లక్షల మంది అమ్మలకు రూ.6,600 కోట్ల పంపిణీకి ఏర్పాట్లు.   
– ఈ పథకం వల్ల డ్రాపౌట్లు తగ్గుతాయి.  
– పేద కుటుంబంలోని ప్రతి పిల్లాడికి విద్య అందడం ద్వారా ఆయా కుటుంబాలు వృద్ధి చెందుతాయి. 

 


2) ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ
– ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు.. భూసేకరణ వేగవంతం.
– మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్‌.
– అవసరమైతే ఆ ఇంటిమీద పావలా వడ్డీకే బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించడం. 
మార్చి 1 నాటికి కటాఫ్‌ తేదీగా లబ్దిదార్ల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించిన సీఎం
– ఇప్పటివరకు 22.7 లక్షల మంది లబ్దిదారులు గుర్తింపు

 


3) ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు 
– అవినీతికి ఆస్కారం లేకుండా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకం. 
– ఉద్యోగులకు పూర్తిగా జీతాలు వచ్చేట్టు చేయడమే ఈ కార్పొరేషన్‌ లక్ష్యం. 
– ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జనవరి 1 నుంచి ఈ కార్పొరేషన్‌ ద్వారానే వేతనాల చెల్లింపు. 

 


4) ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం 
– ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అధ్యయనం కోసం ఆంజనేయరెడ్డి కమిటీ ఏర్పాటు.
– సెప్టెంబర్‌ 3న మధ్యంతర నివేదిక.
– విలీనం ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఏడుగురు సభ్యులతో వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు. 

 


5) ఇంగ్లిష్‌ మీడియానికి ప్రజల మద్దతు  
– వచ్చే ఏడాది 1 నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా కొనసాగిస్తూనే ఇంగ్లిష్‌ మీడియం. 
– ఉపాధి, ఉన్నత విద్యలో పేద పిల్లలు వెనుక బడకుండా ఉండేందుకు దోహదం.  

 


6) వైఎస్సార్‌ నేతన్న నేస్తం(డిసెంబర్‌ 21న ప్రారంభం) 
– మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేల సాయం. 
– ఇప్పటి వరకు 73,594 మంది లబ్ధిదారుల గుర్తింపు.  

 


7) వైఎస్సార్‌ లా నేస్తం (డిసెంబర్‌ 3న ప్రారంభం)
– జూనియర్‌ న్యాయవాదులకు మొదటి మూడేళ్ల ప్రాక్టీస్‌ సమయంలో నెలకు రూ.5 వేల సాయం.

 


8) వైఎస్సార్‌ పెళ్లి కానుక  (శ్రీరామనవమి రోజు ప్రారంభం)
– ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల చెల్లెమ్మల వివాహానికి రూ.లక్ష సాయం.. బీసీ చెల్లెమ్మల వివాహానికి రూ.50 వేలు సాయం.

 


9) వైఎస్సార్‌ ఆసరా  
– పొదుపు సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు. ఇందుకోసం ఈ బడ్జెట్లో రూ. 1,788 కోట్లు కేటాయించారు. 
– సున్నా వడ్డీకే రుణం లక్ష్యం రూ.16,819 కోట్లు. 
డ్వాక్రా సంఘాలకు ఎన్నికల నాటికి ఉన్న అప్పుల మొత్తాన్ని నాలుగు విడతల్లో నేరుగా వారి చేతికే ఇస్తారు.

 


10) వైఎస్సార్‌ చేయూత  
– 45 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు నాలుగేళ్లలో (రెండవ ఏడాది నుంచి) దశల వారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా రూ.75 వేల సాయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: