ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టి నేటితో ఆరు నెలలు అవుతోంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైస్సార్సీపీ ప్రభుత్వంపై అందరికి భారీ అంచనాలు ఉన్నాయి. నవరత్నాల హామీలతో, ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్ ఆరు నెలల్లో ఉత్తమ ముఖ్యమంత్రి అనిపించుకుంటానని ఆయన మాట ఇచ్చారు. గతంలో ఏ మాత్రం పాలన అనుభవం లేని ఆయన ఆర్థిక లోటుతో సతమతం అవుతున్న రాష్ట్రాన్ని ఏరకంగా ముందుకు తీసుకెళ్తున్నారు? ఈ ఆరు నెలల్లో ఆయన బెస్ట్ సీఎం అనిపించుకున్నారా? జగన్ తీసుకున్న ఉత్తమ నిర్ణయాలేం ఏం తీసుకున్నారు? చూద్దాం..

 

 

 

సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఫించన్లు పెంపు ఫైలు పై సంతకం పెట్టిన జగన్, మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాల అమలు దిశగా అడుగులేశారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్, సీపీఎఫ్ రద్దు దిశగా నిర్ణయం తీసుకున్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేశారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు కలిపి ఏకంగా నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు. ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి నిరుద్యోగుల్లో ఉత్సాహన్ని నింపారు. పరిశ్రమల రంగంలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా జగన్ నిర్ణయం తీసుకున్నారు.

 

 

 

దశల వారీగా మద్యపానం నిషేధం దిశగా అడగులేస్తున్న జగన్, మొదటగా బెల్ట్ షాపులను రద్దు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం షాపులను నిర్వహిస్తూ మద్యం దుకాణాల సంఖ్యను కొద్దిగా తగ్గించారు. ఆదాయం కంటే ప్రజా ఆరోగ్యమే తన ప్రాధాన్యమని జగన్ చెప్పుకొచ్చారు. కానీ అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టాల్సి ఇంకా మిగిలి ఉంది.

 

 

 

కేబినెట్‌ లో సామాజిక సమత్యులత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్న జగన్, ఏకంగా ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులును ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించనని చెప్పిన జగన్, ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులెవరైనా తమ పార్టీలో చేరాలంటే ముందుగా వారు పదవులకు రాజీనామా చేసి రావాలని ప్రకటించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: