ప్రపంచంలో అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు మనసును తీవ్రంగా గాయపరిస్తే, మరికొన్ని నవ్వు తెప్పించేలా ఉంటాయి. ఇకపోతే మనిషికి మరణం సహజం. కాని మరణించే ముందు తన చివరికోరిక గుర్తుకు వచ్చి, దాన్ని నెరవేర్చుకోవడం అనేది నిజంగా గొప్పవిషయం. ఇలాంటి అవకాశం ఒక్క ఉరిశిక్షపడ్డ ఖైదీలకు మాత్రమే దక్కుతుంది. కాని ఇలాంటి అవకాశం ఓ అదృష్టవంతుడైన తాతకు దక్కింది.

 

 

తనకు మృత్యుగడియలు దగ్గర పడ్డాయని తెలుసుకున్న ఆ తాతగారు.. తన చివరి కోరికను తన కొడుకులతో కలిసి నెరవేర్చుకుని కన్నుమూసాడు. ఇంతకు అతని కోరిక ఏంటో తెలుసుకుందాం. అమెరికాలోని విస్కాన్సిన్‌లో ఉన్న  నార్బెర్ట్ స్కేమ్ అనే వృద్ధుడు అనారోగ్యంతో మంచం పట్టాడు. వైద్యులు అతడు ఇక బతకడని చెప్పారు. దీంతో స్కేమ్ భావోద్వేగానికి గురై చివరి సారిగా తన ఆఖరి కోరిక తీర్చాలని కొడుకులను  కోరాడు. అదేమంటే తనకు ఒక బీరు తాగి మరణించాలని ఉందని తెలిపాడు.

 

 

ఇకపోతే  87 ఏళ్ల స్కెమ్‌ ప్రేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. వైద్యులు ఇక బతకడం కష్టమని చెప్పడంతో తన ఆఖరి క్షణాలను కుటుంబ సభ్యులతో హాయిగా గడపాలని నిర్ణయించుకున్నాడు. అలా బీరు తాగిన కొద్ది గంటల తర్వాత భార్య, కొడుకు, మనవళ్లతో కాసేపు మాట్లాడి చనిపోయాడు. ఈ ఫొటో వైరల్ కావడంతో కొంతమంది నెటిజనులు తమ ఆప్తుల అంతిమ గడియాల్లో వారి ఆఖరి కోరికలను తీర్చినప్పటి చిత్రాలు, భావోద్వేగ క్షణాలను ఇప్పుడు ట్వీట్ చేస్తున్నారు.

 

 

ఇకపోతే స్కెమ్ మనవడు ఆడమ్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘‘మా తాత ఈ రోజు చనిపోయాడు. అతని ఆఖరి కోరికలో భాగంగా నిన్న రాత్రి తన కొడుకులతో కలిసి చివరి బీర్ తాగాడు’’ అని తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన చనిపోవడానికి కొద్ది గంటల ముందు తన భార్య జాన్నె, ఆయన కొడుకులు బాబ్, టామ్, జాన్‌లతో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేశాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: