వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి ఈ రోజుకి ఆరు నెలలు అవుతుంది. నవరత్నాల హామీతో ఎన్నికలలో ఘన విజయం సాధించిన జగన్.. తాను ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా నెరవేరుస్తా.. ఉత్తమ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటా అని ప్రమాణం చేసారు. అయితే జగన్ ఆరునెలల పాలన నేటితో పూర్తవడంతో ఈ సందర్భంగా వైసీపీ నేతలు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 'ప్రమాణం చేసినట్లే ది బెస్ట్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నాడు' అంటూ సోషల్ మీడియాలో బాగా మెచ్చుకుంటున్నారు. అలా సీఎం బాధ్యతలను చేపట్టాడో లేదో.. వెంటనే పింఛన్ ఫైలుపై సంతకం పెట్టి ఆశ్చర్యపరిచాడు. పోలీసులకి వీక్ ఆఫ్ హాలిడేస్ ఇచ్చాడు. నిరుద్యోగుల కోసం గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు కలిపి నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు. దశలవారీగా మద్యపాన నిషేధం కోసం చర్యలు చేపడుతున్నారు జగన్. ఆరోగ్య శ్రీ, అమ్మ ఒడి, అగ్రిగోల్డ్ బాధితుల‌కు చెల్లింపులు, ఆటోవాలాల‌కు ఆర్థిక సాయం, మ‌త్య్సకార భరోసా, రైతు భ‌రోసా, నాయీ బ్రాహ్మణులకు హామీలు వంటివి సీఎం జగన్ అమలు చేశారు. 

ఈ క్రమంలోనే జగన్ మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల ట్వీట్ చేస్తూ.. ‘ఈ ప్రభుత్వానికి మీ చల్లని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని.. రాష్ట్ర ప్రగతికి నేను వేస్తున్న ప్రతి అడుగులో మీరంతా అండగా నిలవాలని కోరుకుంటున్నాను’ అంటూ తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల పాలన గురించి ఒక వీడియో కూడా తన ట్విట్టర్ అకౌంట్ లో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో రైతు భరోసా, ఫించన్ల పథకం, నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు, అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, మత్స్యకార పథకం, చదువుల విప్లవం, మద్యపాన నిషేధం ఇలా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను చూపించారు. 

https://mobile.twitter.com/ys_sharmila/status/1200656949836054530?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1200656949836054530&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Fpolitics%2Fys-sharmila-tweets-on-ap-cm-jagan-six-moths-ruling-sb-386608.html

మరింత సమాచారం తెలుసుకోండి: