దుశ్శాసన పర్వం.. ఛీ...! ఛీ..! వీళ్లు మనుషులా..పశువులా..! మృగాలు కూడా ఇంత నీచంగా ప్రవర్తించవు...! కామంతో కళ్లు మూసుకుపోయిన నాలుగు తోడేళ్లు ... ఆ వెటర్నరీ డాక్టర్‌పై కిరాతకానికి పాల్పడ్డాయి. దేశవ్యాప్తంగా ఆ మానవ మృగాళ్లను నడిరోడ్డులో ఉరితీయాలంటూ.. మండిపడుతున్నారు ప్రజలు. సోషల్ మీడియాలో ఓ వైపు ప్రియాంక రెడ్డికి నివాళులు అర్పిస్తూనే.. ఆ మానవ మృగాల చేతిలో ఆమె ఎంత నరకం అనుభవించి ఉంటుందోనని తలచుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. 

 

అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ముందు వరస సంగతేమోగానీ... ఆడవారిపై అత్యాచారాలు, అఘాయిత్యాల విషయంలో మాత్రం మన గణాంకాల్లో ఏటా అసాధారణ వృద్ధి కనిపిస్తోంది. నిర్భయ చట్టం వచ్చింది. కానీ.. అమ్మాయిలకు అభయం మాత్రం దొరకడం లేదు. పోస్కో ఆర్డినెన్స్ వచ్చింది. కానీ... ఆఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు.. ఊరికో అసిఫా.. వీధికో నిర్భయ ఇప్పటికీ బలవుతూనే ఉన్నారు. మదమెక్కిన మృగాళ్ల చేతికి చిక్కి సమిథలవుతున్నారు.

 

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన వైద్యురాలు ప్రియాంకారెడ్డి హత్యపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెటర్నరీ డాక్టర్లు. పశు సంవర్ధక శాఖ సంచాలకుల కార్యాలయంలో.... ప్రియాంక చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దోషులకు ఉరిశిక్షపడేలా చూడాలని డిమాండ్ చేశారు.


డాక్టర్ అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా రాజేంద్రనగర్‌లో మానవహారం నిర్వహించారు ప్రజలు. ప్రియాంకారెడ్డి మృతికి శ్రద్ధాంజలి ఘటించిన వెటర్నరీ డాక్టర్లు.. ఆమెపై దాష్టికానికి పాల్పడ్డ మృగాళ్లు సభ్యసమాజంలో తిరగడానికి అనర్హులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక హత్యకు కారకులైన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రియంక కేసులో దోషులను శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు.మరోవైపు అటు ప్రజా సంఘాలు, సినీనటులు, రాజకీయ నాయకుల నుంచి పెద్ద ఎత్తున ప్రియాంక ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. వాళ్లకు తాముున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: