ఈ టైటిల్ చూసి షాక్ అవ్వకండి... దేనికోసం ఈ టైటిల్ అని సందేహించకండి. వైఎస్ జగన్ ఆరు నెలల పాలను పూర్తి చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన ఈ ఆరు నెలల కాలంలో ఎలాంటి హామీలు ఇచ్చారో.. వాటిని నెరవేర్చుకుంటూ వస్తున్నారు.  ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు.  నవరత్నాల హామీలను నెరవేరుస్తున్నారు.  అక్కడితో ఆగకుండా.. ఇంకా అనేక పధకాలను ప్రవేశపెట్టి వాటి అమలు కూడా వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు.  
మే నెలాఖరులో అధికారం చేపట్టిన జగన్, ప్రమాణస్వీకారం చేసిన రోజున వృద్ధాప్య పింఛన్ కు సంబంధించిన ఫైల్ మీద మొదటి సంతకం చేశారు.  యువతకు 4లక్షల ఉద్యోగాలు, రైతు భరోసా, వాహనమిత్ర, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా ఇలా ఎన్నో పథకాలను అమలు చేశారు. అలాగే స్థానికులకు 75శాతం ఉద్యోగాలు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50శాతం అవకాశం వంటి ఎన్నో చేశారు.  
ఆరు నెలల కాలంలో చేసిన జగన్ చేసిన మంచి పనుల గురించిన ఓ వీడియోను రూపొందించి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఇచ్చిన హామీలను ఇచ్చినట్టుగా నెరవేరుస్తున్నట్టు వైకాపా ప్రభుత్వం పేర్కొన్నది.  ఎక్కడా కూడా హామీల విషయంలో తాము అలసత్వం ప్రదర్శించలేదని అంటున్నారు.  ప్రభుత్వం ఈ విషయంలో అలర్ట్ గా ఉందని, ఎన్ని బాధలు పడైనా సరే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని అంటున్నారు.  
ప్రజలకు సేవ చేసేందుకు తాను అధికారంలోకి వచ్చినట్టు జగన్ తెలిపారు.  ఇక ప్రజలకు ఒక సేవకుడిగా సేవ చేస్తున్నట్టు అయన చెప్పారు.  అయితే, జగన్ ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో జరిగిన పాలనపై ప్రతి పక్షాలు పెదవి విరుస్తున్నాయి. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోందని, హామీలు ఇచ్చి వదిలేస్తున్నారని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని అన్నారు.  ఆగస్టు నెలలో మూడుసార్లు ప్రభుత్వం అప్పులు చేసిందని చంద్రబాబు చెప్పడం విశేషం.  బాబు చేసిన వ్యాఖ్యలను వైకాపా ప్రభుత్వం ఇప్పటికే ఖండించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: