తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..యావత్ దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసింది వెటర్నరీ వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్యోదంతం.  దేశ వ్యాప్తంగా ఆమెపై కృరంగా  అత్యాచారం చేసి హతమార్చిన నింధితులకు మామూలు శిక్ష సరిపోదని..బహిరంగంగా శిక్షించాలని అంటున్నారు.. మరికొంత మంది ఆ కృర మృగాళ్లకు వెంటనే ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. సినీ, రాజకీయ సెలబ్రెటీలు సైతం ఈ విషయంపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.  ప్రియాంక కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.  తాజాగా  డాక్టర్ ప్రియాంక రెడ్డిని దారుణంగా హతమార్చిన ఘటనపై జనసేన అక్ష్యక్షులు, నటులు పవన్ కళ్యాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  

 

ఆడవాళ్ల గురించి స్టేజీలెక్కి లేక్కలేనన్ని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు..వారి రక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలని అన్నారు. ప్రియాంక  హత్యోదంతం తనను తీవ్రంగా కలచివేసిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. నోరు లేని మూగజీవాలకు చికిత్స చేసే ఆమె.. మానవ మృగాలకు బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘యత్ర నార్యేస్తూ పూజ్యంతే.. రమంతే తత్ర దేవతా’ అని మాట్లాడుకోవడానికి, రాసుకోవడానికే తప్ప ఆచరణలోకి తీసుకురావడం లేదు.  

 

ఇటీవల కాలంలో చిన్నారులు, వృద్దులపై కామాంధులు లైంగిక దాడులు, అత్యాచారాలకు పాల్పపడుతున్నారని.. సభ్యసమాజం తలదించుకునేలా కృరంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం చిత్తూరు జిల్లాలో ఆడుకుంటున్న చిన్నారిని ఓ దుర్మార్గుడు చిదిమేశాడు. హనుమకొండలో తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశారని... వరంగల్‌లో ఇంటర్నీడియట్‌ విద్యార్థినిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడి చంపేశాడు. ఇలాంటి వారికి కఠిన చట్టాలు అమలు చేయకపోవడం వల్ల రెచ్చిపోతున్నారని అన్నారు.

 

నిర్భయ చట్టం తీసుకొచ్చినా బాలికలు, యువతులపై అత్యాచారం, వేధింపులకు పాల్పడేవారికి ఎలాంటి భయమూ ఉండటం లేదు. ఆడబిడ్డలపై అత్యాచారాలకు పాల్పపడి, హత్యలు చేసే వారికి దారుణమైన శిక్షలు విధించాలని.. ఆ శిక్షలు చూస్తే మరోసారి ఇలాంటి దారుణాలకు పాల్పపడాలంటే భయపడిపోవాలని అన్నారు.  సింగపూర్‌లాంటి దేశాల్లో ఇలాంటి శిక్షలు అమల్లో ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో పెట్రోలింగ్‌, పర్యవేక్షణ పెంచాలి. అంతేకాదు విద్యార్థినులు, యువతల్లో ఆత్మస్థైర్యం పెంచడంతో పాటు ప్రాణ రక్షణ కోసం వారికి మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పించాలి’’ అని పవన్‌ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: