హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో జరిగిన వింతైన సంఘటన ఇది.  సాధారణంగా అతిగా మద్యం తీసుకోవడం వల్లనో లేదా తాగి ఎక్కడైనా పడి పోవడం వల్లనో చనిపోయిన సంఘటనలు ఇప్పటివరకు చూసాము విన్నాము కానీ  గుడ్డు గొంతులో  ఇరుక్కొని వ్యక్తి దుర్మరణం పాలైన విషాద సంఘటన  ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది.

అసలు విషయానికి వస్తే  యాచారం మండలానికి చెందిన  మచ్చ యాదయ్య అనే  వ్యక్తి  సమీప పట్టణం  ఇబ్రహీంపట్నంలోని శ్రీరామ వైన్స్‌లో సహాయకుడిగా పని చేస్తున్నాడు. అలాగే అది వైన్స్ కావడం తో అడ్డు అదుపు లేకుండా మద్యం సేవించడం ఏ అర్ధరాత్రో ఇంటికివెళ్ళే యాదయ్య ఆ రోజు  కూడా మద్యం తాగుతూ కోడిగుడ్డును అమాంతం తినేయడం వల్ల అది గొంతులో ఇరుక్కొని ఊపిరాడకపోవడంతో బాధితుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. అంతలోనే హాస్పిటల్ కు తీసుకెళ్లే లోపే చనిపోయాడని తెలియడం తో బంధువులు మరియు భార్యాపిల్లలు గుండెలుఅవిసేలా ఏడ్చారు.

 

  నవంబర్ 28  గురువారం రాత్రి విధులు ముగిసిన తర్వాత యాదయ్య వైన్స్‌లోని పర్మిట్ రూమ్‌లో మద్యం సేవిస్తూ ఉడికించిన గుడ్డుని  మందు పెగ్ తీసుకున్న వెంటనే తింటుండగా అది గొంతులో ఇరుక్కుని అక్కడే కుప్పకూలిపోయాడు. తోటి సిబ్బంది అతడిని గమనించి వెంటనే  దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.ఆస్పత్రికి తీసుకొచ్చే సరికే యాదయ్య చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. యాదయ్యను పరీక్షించిన వైద్యులు గొంతులో గుడ్డు ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడకపోవడం వల్ల  విలవిలలాడాడని కొంత సమయం అవస్థ పడ్డాడని తరువాత మృతి చెందాడని వెల్లడించారు. అక్కడ అతడు మందు తాగుతుండగా చుసిన తోటి సిబ్బంది అతడు కొంచం తొందర తొందరగా మందు తీసుకున్నాడని అంతలోనే గొడ్డుని ఒకే సరి నోట్లో వేసుకొని తినే ప్రయత్నం లో ఈ ఘటన జరిగింది అని తెలియచేసారు. చాల సేపు అవస్థ పడ్డాడని అతడికి కొంచం కొంచంగా మంచినీటిని ఇస్తూ కొంచం ఉపశమనానికి ప్రయత్నించామని కానీ ఉపయోగం లేకుండా పోయెండని వెల్లడించారు. ఈ విషయం తెలిసిన పోలీసులు దర్యాప్తు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంబంధిత హాస్పిటల్ కి తీసుకెళ్లారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: