ఉద్దవ్ థాకరే ప్రభుత్వం ఈరోజు బలపరీక్షను నిర్వహించుకుంది.  ఈ బలపరీక్షలో ఉద్దవ్ థాకరే ప్రభుత్వం నెగ్గింది.  అయితే, సభలో స్పీకర్ స్పీకర్ ఎన్నుకునే వరకు మొదట ప్రొటెం స్పీకర్ సభను నిర్వహించాలి.  ప్రొటెం స్పీకర్ సమక్షంలోనే స్పీకర్ ను ఎన్నుకుంటారు.  కానీ, అలాంటిది ఏమి జరగకుండా సభలో ప్రొటెం స్పీకర్ లేకుండా శివసేన తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని నియమించుకొని బలపరీక్ష నిర్వహించింది.  దీంతో ఫడ్నవీస్ సభ నుంచి వాకౌట్ చేశారు.  
ఫడ్నవీస్ తో పాటు బీజేపీ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు.  అయితే, మొదట ప్రొటెం స్పీకర్ గా బీజేపీకి చెందిన కాళిదాస్ ను గవర్నర్ నియమించారు.  ఆ తరువాత ప్రొటెం స్పీకర్ గా దిలీప్ ను స్పీకర్ నియమించారని అయన సమక్షంలోనే విశ్వస పరీక్ష నెగ్గిందని అంటున్నారు.  విశ్వాస పరీక్షలో నెగ్గిన థాకరే ప్రభుత్వం ఎన్ని రోజులు ఆ సీట్లో ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  288 సీట్లు ఉన్న సభలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఇంకా కొన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.  
కాంగ్రెస్ కలిసి కాపురం చేయడం అంటే మాములు విషయం కాదు.  బీజేపీతో కలిసి ఉండగా శివసేన పార్టీ బీజేపీపై అనేక సెటైర్లు వేసింది.  కానీ, బీజేపీ సైలెంట్ గా ఉన్నది.  ఇపుడు కాంగ్రెస్ పార్టీ మీద అలా సెటైర్లు వేస్తె కుదరని పని.. ఆ సంగతి శివసేనకు తెలుసు.  ఇక ఎన్సీపీ తమకు ఎటు అనుకూలంగా ఉంటె అటు దూకుతుంది.  అందులో సందేహం అవసరం లేదు.  శివసేనలో ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు.  
వీరంతా ఏ సమయంలో ఆ పార్టీకి హ్యాండ్ ఇస్తారో చెప్పలేం.  పాలనలో ఉద్ధవ్ కు అనుభవం లేదు.  ఇప్పుడు కాంగ్రెస్ కూటమిలో ఉన్నారు కాబట్టి ప్రతి విషయం కాంగ్రెస్ పార్టీతో చెప్పి తీసుకోవాలి.  అది శివసేనకు నచ్చుతుందా అన్నది తెలియాల్సిన అంశం.  కాంగ్రెస్ పార్టీలో చాలా కూటములు ఉన్నాయి.  మహారాష్ట్రలో ఐదేళ్లు శివసేన కూటమి అధికారంలో ఉంటుందా అన్నది చూడాల్సిన అంశం.  ముఖ్యమంత్రి పీఠం కూర్చోవాలి అనే కోరికను ఉద్దవ్ నెరవేర్చుకున్నారు.  ఆ తరువాత ఏంటి అన్నది అయన  చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: