ఉల్లికి హెల్మెట్లకు ఉన్న బంధం ఏంటంటే ?  హెల్మెట్ ఎందుకని ఎవరినైన అడిగితే టక్కున చెప్పే సమాధానం ప్రమాదం జరగకుండా. కాని ఇది వాహనాలు నడిపే వారికి ఉల్లిగడ్దలు అమ్మే వారికి కాదు. కాని ఇక్కద ఇదే జరుగుతుంది. ఎక్కడంటే బీహార్ లో.. ఉల్లిగడ్డలు అమ్మడానికి హెల్మెట్ పెట్టుకొంటున్నారు. దీనికి బలమైన కారణమే ఉంది.

 

 

ప్రస్తుతం మార్కెట్లో ఉల్లిగడ్డల కొరత తీవ్రంగా ఉంది. చాలా చోట్ల కిలో ఉల్లిగడ్డ రూ. 100 పైనే అమ్ముతున్నారు. దీంతో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కిలో చొప్పున మనిషికి రెండు కిలోలు ఇవ్వాలని నిర్ణయించింది. మార్కెటింగ్ శాఖ ఈ అమ్మకాలు చేస్తుంది. అయితే ఉల్లి ధరలపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు తమనెక్కడ కొడతారోనని ముందు జాగ్రత్తగా చర్యగా ఇలా హెల్మ్ ట్లు పెట్టుకొని అమ్ముతున్నారట.  

 

 

ఇకపోతే రాష్ట్రంలో రోజురోజుకి ఉల్లి ధరలు పెరిగిపోవడంతో బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై సరఫరా చేయాలనుకుంది. ఆ పనిని బిహార్‌ రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ శాఖకు అప్పగించింది. దీని ద్వారా ఉల్లిపాయలను కేజీ రూ.35 కే ప్రజలకు అందించనున్నారు. అయితే,‘ఉదయం నుంచి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. కిలోమీటర్ల మేర బారులు తీరి నిలబడ్డారు. ఉల్లిపాయలను అందజేయడంలో ఆలస్యం అయితే వారు మాపై దాడి చేసే ప్రమాదం ఉంది. రాళ్లు రువ్వే అవకాశం ఉంది.

 

 

అధికారులు ఇక్కడ మాకు ఎలాంటి రక్షణ కల్పించలేదు. అందుకే మాకు మేముగా రక్షణగా హెల్మెట్లను ధరించి అందరికి ఉల్లిగడ్దలను పంచుతున్నామని తెలిపారు.  ఇకపోతే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ, ఇప్పుడు అదే ఉల్లి ప్రజలకు కన్నీరు తెప్పిస్తున్నాయి. ఉల్లిగడ్డల ధరలు ఆకాశానంటుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి ధరల నియంత్రలో ప్రభుత్వం చోరవ చూపడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే కిలో రూ.100 రూ. 120 వరకూ ఉంటున్నాయి. ఇక ఉత్తర భారతదేశంలో అయితే ఉల్లి ధరలు వంద నుంచి ఐదు వందల రూపాయలు ఉంటున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ఉల్లిగడ్డలు కొనాలంటేనే బెంబేలేత్తిపోతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: