అభం శుభం ఎరుగని ఓ డాక్టర్ దుర్మార్గుల పాలన పడి మాన ప్రాణాలను కోల్పోయిన ఘటన ఇపుడు దేశాన్ని పట్టి కుదుపుతోంది. ప్రియాంకారెడ్డి దారుణం దేశాన్ని ఒక్కటిగా చేసి ఒకే గొంతు వినిపిస్తోంది. ఈ దేశంలో ఆడవారికి రక్షణ లేదా అని నిగ్గదీస్తోంది. అడవాళ్ళుగా పుట్టడమే పాపమా అని కూడా గద్దిస్తోంది.

 

నిజంగా ఇది కేసీయార్ సర్కార్ కి పెద్ద మచ్చగా మారుతోంది. ఈ కేసు విషయంలో పోలీసులు ఎన్ని చెప్పినప్పటికీ నగరం నడిబొడ్డున మహిళలకు రక్షణ లేదన్నది లోకానికి తెలిసిపోయింది. ఇరవై నాలుగు గంటలూ వాహనాలతో రద్దీగా ఉండే టోల్ ప్లాజాకు కూత వేటు దూరంలోనే దారుణం జరిగినా పోలీసులు సకాలంలో స్పందిచకపోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.

 

దీని మీదా జాతీయ మహిళా కమిషన్ కూడ సీరియస్ గానే ఉంది. మహిళలకు భద్రత ఇవ్వలేని పోలీసులు అంటూ నిప్పులు చెరుగుతోంది. ఈ రోజు హైదరాబాద్ కి మహిళా కమిషన్ సభ్యులు వచ్చారు. వారు ప్రియాంకారెడ్డి తల్లితండ్రులను పరామర్శింఛడమే కాకుండా ఘటనా స్థలానికి కూడా వెళ్ళి దర్యాప్తు జరిపారు. ఆ స్థల య‌జమానినిని కూడా పిలిచి విచారణ చేశారు.

 

తాము సొంతంగా విచారణ చేపడతామని కూడా జాతీయ మహిళా కమిషన్ చెప్పడం ఓ విధంగా తెలంగాణా పోలీసులకు మైనస్ పాయింట్ కింద లెక్క. మరో వైపు చూసుకుంటే తెలంగాణా గవర్నర్ తమిళ్ సై కూడా ప్రియాంకా తల్లిదండ్రులను పరామర్శిస్తున్నారు.  ఇక హోం మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సైతం ఇది దారుణం. నిందితులకు ఉరి తీయాల్సిందేనని అంటున్నారు. పాత చట్టాలను తిరిగరాసైనా మహిళలకు రక్షణ కల్పిస్తామని ఆయన అంటున్నారు. 

 

ప్రియాంకా రెడ్డి దారుణం పై నిరసనలు ఎక్కడా ఆగడంలేదు. ఓ విధంగా అటు తెలంగాణా పోలీసులకు ఈ కేసు మాయని మచ్చగా మిగిలింది. రాజకీయంగా చూసుకున్నా అంతర్జాతీయ మహా నగరంగా ఉన్న హైదరాబాద్ లో ఇలాంటివి జరగడంతో టీయారెస్ సర్కార్ ప్రతిష్ట కూడా దెబ్బ తింది. ఈ విషయం నుంచి బయటపడేందుకు టీయారెస్ సర్కార్ ఏం చేస్తుందన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: