తప్పు చేసిన వారిని తక్షణమే శిక్షించాలని షాద్ నగర్ ప్రజలు, విద్యార్థి, మహిళాసంఘాల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు . పశు వైద్యురాలు ప్రియాంకారెడ్డి పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుల్ని తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తూ , పోలీసు స్టేషన్ ముట్టడికి ప్రయత్నించారు . పోలీస్ స్టేషన్ పై రాళ్లు, చెప్పులు విసిరారు . అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్ లోకి దూసుకువెళ్ళే ప్రయత్నాన్ని చేశారు . పోలీసులు ప్రజల్ని , విద్యార్థి , మహిళాసంఘాల కార్యకర్తలను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు .

 

అయినా ప్రజలు అక్కడి నుంచి కదలకుండా , నిందితుల్ని తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు . అత్యాచార ఘటన కు పాల్పడి , ప్రియాంకారెడ్డి ని హత్య చేసిన నిందితులకు,  మేజిస్ట్రేట్ అధికారులున్న తహశీల్ధార్ పాండు నాయక్ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు . నిందితులను జైలు కు తరలించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు . రోడ్డుపై పెద్ద సంఖ్యలో జనం పోగై ఉండడం, పెద్ద సంఖ్యలో జనం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకుంటుండడం తో , నిందితులకు రక్షణ కల్పించేందుకు పోలీసులు అదనపు బలగాలను రప్పించారు . పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి , ప్రజలను కట్టడి చేసే ప్రయత్నం లో తలమునకలయ్యారు . ప్రజాగ్రహం తీవ్రంగా ఉండడం , వారిని కట్టడి చేయడానికి పోలీసులకు మరింత కష్టతరం అవుతోంది .

 

షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట గుమికూడిన జనాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసిన , ప్రజలు లెక్కచేయకుండా నిందితుల్ని ఉరి తీయాలని నినదిస్తున్నారు . నిందితుల్ని చట్టపరంగా శిక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని , ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని పోలీసు అధికారులు పదే, పదే విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు మాత్రం వెనక్కి తాగకపోవడం తో, మరిన్ని అదనపు బలగాల సహకారంతో నిందితుల్ని జైలుకు తరలించే ప్రయత్నాన్ని చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: