వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్యకేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు చెప్పింది. వీరిని ఈ అర్ధరాత్రి మహబూబ్ నగర్ జైలునకు తరలించే అవకాశం ఉంది. మూడు రోజుల క్రితం బుధవారం రాత్రి ఈ నిందితులు ప్రియాంకారెడ్డిని మానభంగం చేసి హత్య చేసిన సంగతి విధితేమే.

 

కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే నిందితులు దొరికిపోయారు. అంతవరకూ పోలీసుల చాకచక్యాన్ని అభినందించి తీరాలి. ఇదిలా ఉండగా ఈ కేసులొ నలుగురు నిందితులకు ఉరి శిక్ష్న విధించాలన్న డిమాండ్ వూపందుకుంటోంది. అదే సమయంలో వారిని ఎన్ కౌంటర్ చేయాలని కూడా డిమాండ్ వస్తోంది.

 

మరో వైపు మహిళా సంఘాలు, సోషల్ మీడియాలో సైతం నిందితులను కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా ఉరి వేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ సైతం ఈ విషయంలో సీరియస్ గానే ఉంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం నిందితులకు వ్యతిరేకంగా సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

 

మరో వైపు నిందితుల తరఫున వారు సైతం తమ బిడ్డలను ఎవరూ క్షమించవద్దు అంటున్నారు. నిందితులలో ఒకరైన చెన్న కేశవులు తల్లి ఇదే విషయం చెబుతూ తమ బిడ్డ తప్పు చేశాడని, అందువల్ల తాను కూడా అతన్ని చంపేయాలనే కోరుకుంటున్నానని చెప్పారు. 

 

 

అయితే న్యాయ నిపుణులు, మేధావులు మాత్రం ఇది బాధతో చేస్తున్న డిమాండ్ తప్ప వేరొకటి కాదని అంటున్నారు. ఎవరినైనా రాజ్యాంగం ప్రకారమే శిక్షించాలని, ఆ విధంగా ప్రియాంకా నిందితుల విషయంలో తొందరగా న్యాయ విచారణ జరిపించి తగిన శిక్ష విధించేలా చూడాలని అంటున్నారు.

 

 

మరో వైపు ట్విస్ట్ ఏంటి అంటే ఈ లారీ ఓనర్ శ్రీనివాసరెడ్డిని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఆయన నుంచి మరింత సమాచారాన్ని కూడా వారు సేకరించనున్నారు. మొత్తానికి ప్రియాంకా ఘటనలో పోలీసులు గట్టిగాన విచారణ చేస్తున్నారనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: