పశు వైద్యురాలు ప్రియాంకారెడ్డి అత్యాచార, హత్య ఘటన ప్రజల్లో ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది . నిందితుల్ని తక్షణమే ఉరి తీయాలని వందలాది మంది ప్రజలు పోలీసు స్టేషన్ ను దిగ్బంధనం చేశారు . దీనితో షాద్ నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి .  నిందితుల్ని వెంటనే ఉరితీయాలని, లేదంటే ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తూ , రోడ్డుపైకి రావడం తో పోలీసులకు ఏమీ చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది . షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో నిందితులు ఉన్న విషయాన్ని తెలుసుకున్న స్థానిక ప్రజలు , విద్యార్థి , మహిళా సంఘాల కార్యకర్తల పెద్ద  సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడం తో , నిందితుల్ని కోర్టు కు తరలించడం పోలీసులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది .

 

దీనితో మెజిస్ట్రేట్ అధికారాలున్న తహశీల్ధార్ ను పోలీసు స్టేషన్ కు పిలిపించి అతని ముందు వాంగ్మూలాన్ని నమోదు చేశారు . మెజిస్ట్రేట్, నిందితులకు 14  రోజులపాటు రిమాండ్ విధించడం తో వారిని పోలీసు స్టేషన్ కు తరలించాలన్న పోలీసులకు పట్టపగలే స్థానికులు , విద్యార్థి , మహిళా సంఘాల కార్యకర్తలు చుక్కలు చూపించారు . నిందితుల్ని పోలీసు స్టేషన్ లో పెట్టి తాళం వేసి పోలీసులు బయట కాపాలా కాయడం తో ఆగ్రహించిన ప్రజలు, పోలీసు స్టేషన్ పైకి రాళ్లు , చెప్పులు విసిరి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు .

 

నిందితుల్ని తమకు అప్పగించాలని  ప్రజలు పోలీసు స్టేషన్ వైపు దూసుకురావడం తో వారిని కట్టడి చేసేందుకు లాఠీలకు పని చెప్పిన ప్రయోజనం లేకుండా పోయింది . పోలీసులు లాఠీఛార్జ్ చేసిన ఎవరు కూడా పోలీసు స్టేషన్ దగ్గరి నుంచి కదలకపోవడం తో నిందితుల్ని జైలు కు తరలించే ప్రక్రియ ను పోలీసులు అంతకంతకు జాప్యం చేస్తూ వస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: