ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా అది సోషల్ మీడియాలో క్షణాల్లో అయిపోతుంది. ఒకప్పుడైతే ఎక్కడో  జరిగిన విషయాన్ని తెలుసుకోవడానికి అంతగా వెసులుబాటు  ఉండేది కాదు కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ ఏ విషయం జరిగిన అది క్షణాల్లో అర చేతిలో ఉన్న మొబైల్ లో కనిపిస్తుంది. దీంతో ప్రపంచంలోనే వింత సంఘటనలు అన్నీ మనం సోషల్ మీడియా లో చూడడానికి వీలవుతుంది. అంతేకాదండోయ్ ప్రతి  రోజు సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎన్నో చూస్తుంటాం. ఇప్పుడు ఇలాంటి ఓ వీడియోనే  తెగ వైరల్ అయిపోతుంది. ఓ ఫారెస్ట్ ఆఫీసర్ ఎలుగుబంటును వీడియో తీసి పంపగా అదిప్పుడు అందరిని ఆకర్షిస్తుంది నెట్టింట్లో వైరల్ గా మారింది . ఎలుగుబంటి వీడియోలో  ఆకర్షించడానికి ఏముంది అంటారా... ఫారెస్ట్ ఆఫీసర్ తీసిన వీడియో లో ఆ ఎలుగుబంటు  ఏకంగా డాన్స్ పార్టీస్ చేస్తుంది. 

 

 

 

అది కూడా  ఆ ఎలుగు బంటుకు  ఎవరో  డాన్స్ ట్రైనింగ్ చేస్తున్నట్లుగా యాక్టింగ్ చేస్తూ  సందర్శకుల అందరినీ మోసం చేస్తుంది ఎలుగుబంటు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ వీడియో ఎక్కడ నుంచి వచ్చింది. ఈ వీడియో స్టోరీ ఏంటో  తెలుసుకోవాలంటే... ఈ స్టోరీ లో కాస్త ముందుకు వెళ్లాల్సిందే . ఒడిస్సా లో ఈ ఘటన జరిగింది. ఒడిషాలోని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నంద   ఎలుగుబంటు డాన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు చేస్తుండటం చూసి ఆశ్చర్య పోయాడు. వెంటనే మొబైల్ లో ఎలుగు బంటు  డాన్స్ చేస్తున్న వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో కాస్త నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తు నెట్టింట్లో వైరల్ అవుతుంది. 

 

 

 

 ఫారెస్ట్ ఆఫీసర్ పోస్ట్ చేసిన వీడియోలో ఆ ఎలుగుబంటు  చక్కగా డాన్స్ చేస్తుంది. అయితే ఈ ఎలుగుబంటి డాన్స్ చేయడం చూసే వాళ్లకు ఎలా కనిపిస్తుంది అంటే... ఎవరో  ఎలుగుబంటి కు డాన్స్  చేయడం నేర్పిస్తున్నట్లుగా  ఎలుగుబంటు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా డాన్స్ చేస్తుంది. దీనికి సంబంధించిన షార్ట్ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఫారెస్ట్ ఆఫీసర్ నంద . అయితే ఆ వీడియో చూస్తే కనిపించేది ఒకటైతే అక్కడ జరిగిన అసలు విషయం వేరు. అక్కడున్న ఎలుగుబంటు అసలు డాన్స్ చేయడం లేదు... ఎలుగుబంటి వెనకాల ఉన్న చెట్టును తన వీపును గట్టిగా రుద్దుతోంది. బాగా బలంగా రుద్దుతుండటంతో   బాడీ మొత్తం కదులుతోంది. దీంతో చూసే సందర్శకులు అందరికీ అది డాన్స్ చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. అయితే ఈ షార్ట్ వీడియో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మారింది. ఎంతోమంది ఇది చూసిన నెటిజన్లు వీడియో లో ఎలుగుబంటి డాన్స్ సూపర్ అంటూ లైకులు కామెంట్లు పెడుతున్నారు. భలే తెలివైన ఎలుగుబంటు  బలే డాన్స్ చేస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: