ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో వినూత్న పథకాలకు ఊపిరిపోసింది జగన్మోహన్ రెడ్డి  సర్కార్. ప్రజాసంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా... ఆదర్శ పాలన అందిస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు మేలు చేకూర్చే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అయినా వెనుకాడడం లేదు. జగన్ మోహన్ రెడ్డి ఆరు నెలల పాలనలోనే ఎన్నికల ముందు ఇచ్చిన ఎన్నో హామీలను నెరవేర్చారు . పాలనలో  తనదైన ముద్ర వేసుకుంటూ ఎందుకు సాగుతున్నారు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 

 

 

 అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ... పొరుగు  రాష్ట్రాల ప్రజలకు సైతం జగన్ పాలనా చూసి ఔరా అనేలా  పాలన అందించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్ సర్కార్ ఆరునెలల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు మరెన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పాలసి  తీసుకు వచ్చి సంచలనం సృష్టించారు . ఓ వైపు ప్రతిపక్షాలు రివర్స్ టెండరింగ్  పై గగ్గోలు  పెడుతున్న జగన్ సర్కారు మాత్రం ఇందులో విజయం సాధించి చూపించింది. రాష్ట్రంలో  సంపూర్ణ మద్యపాన నిషేధం పాలసీ... ప్రజలు ఎవరు మద్యం బారిన పడి జీవితం నాశనం చేసుకోవద్దని ఉద్దేశంతో  సంపూర్ణ మద్యపాన దిశగా అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.దీని  కోసం విడతలవారీగా మద్యం నిషేధిస్తూ  వస్తున్నారు. 

 

 

 

 ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకొని హామీలను నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక మైనింగ్ పాలసీలు తీసుకువచ్చింది. దీనిద్వారా ఇసుకను ఆన్లైన్లో విక్రయాలు జరిగాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు అన్నింటిలో స్థానికులకే  75 శాతం రిజర్వేషన్ కల్పించి  సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టి రాష్ట్రంలోని ప్రతి తల్లి పిల్లలను స్కూల్ కు  పంపించేందుకు చేయూత నిచ్చేందుకు శ్రీకారం చుట్టింది జగన్ సర్కారు.ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు గుప్పించిన ఎన్ని ఆరోపణలు చేసినా రాష్ట్రంలోని పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టి ముందుకు సాగుతున్నారు. మొదటి విడతగా 1 నుంచి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

 

 

 

 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... రాష్ట్రంలో ఎక్కడైనా అవినీతి జరిగితే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలంటూ 14400 టోల్ ఫ్రీ నెంబర్ ప్రజలకు అందుబాటులో ఉంచారు. రైతు భరోసా, వాహన మిత్ర, జగనన్న వసత్తి, ఆరోగ్య శ్రీ,  ఇలా చెప్పుకుంటూ పోతే ఆరునెలల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది జగన్ సర్కార్.  జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పాలనను గాడిలో పడిందనే చెప్పాలి. జగన్ ప్రభుత్వ హయాంలో మరోసారి రాజన్న పాలన అందిస్తున్నారు సీఎం జగన్ .

మరింత సమాచారం తెలుసుకోండి: