ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యాచారాలకు సంబంధించిన ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నెల్లూరు జిల్లాలో కొన్ని సంవత్సరాల క్రితం సాయికృష్ణ అనే వ్యక్తి మైనర్ బాలికకు చాక్లెట్లు, బిస్కెట్లు ఆశ చూపి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికను మచ్చిక చేసుకొని చాలా సార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడగా బాలిక ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పటంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కేసు నమోదు చేసుకొని నిందితుడు సాయికృష్ణను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నెల్లూరు ఒకటో అడిషనల్ డిస్ట్రిక్ సెషన్స్ కోర్టు ఈ కేసులో సంచలన తీర్పును వెల్లడించింది. బాలిక కోర్టులో నిందితుడు సాయికృష్ణ లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పటంతో కోర్టు సాయికృష్ణ చనిపోయేవరకు జైలులోనే ఉండాలని తీర్పు చెప్పింది. 2015లో ఈ కేసు నమోదు కాగా నాలుగు సంవత్సరాల తరువాత నిందితుడు సాయికృష్ణకు శిక్ష పడింది. 
 
2015 సంవత్సరంలో కడప జిల్లాకు చెందిన బాలిక సెలవుల్లో అమ్మమ్మ వాళ్ల ఇంటికి నెల్లూరుకు వచ్చింది. రోజూ ఒక కిరాణ షాపులో మైనర్ బాలిక చాక్లెట్లు, బిస్కెట్లు కొనుగోలు చేసేది. ముత్తుకూరు ఎమ్మార్వో కాలనీకి చెందిన సాయికృష్ణ ప్రతిరోజు బాలిక కిరాణ షాపుకు రావడాన్ని గమనించాడు. బాలికకు ప్రతిరోజు చాక్లెట్లు, బిస్కెట్లు కొనిపించి బాలికను మచ్చిక చేసుకున్నాడు. ఆ తరువాత బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సాయికృష్ణకు జీవిత ఖైదుతో పాటు కోర్టు 2 లక్షల రూపాయల జరిమానా విధించింది. 
 
మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి కేసులో మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులు ఉన్న షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. నిందితులకు ఉరి శిక్ష విధించాలని లేదా ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: