కోన ప్రాంత టీడీపీ నేతలకు  నమ్మి ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు పొడవడంలో సిద్ధహస్తులైనవారు  అస్సలు విషయానికి వస్తే.ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా  టీడీపీ నేతలు యనమల ఫౌండేషన్‌కు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్‌ఆర్‌) నిధులను దుర్వనియోగం చేశారని  విమర్శించారు. శుక్రవారం జరిగిన బహిరంగ సభ అనగా కోన ప్రాంతం పెరుమాళ్లపురం పంచాయతీ తలపంటిపేట గ్రామంలో  ఆయన ప్రసంగించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎస్‌ఆర్‌ నిధులను ఫౌండేషన్‌ను  సామాజిక బాధ్యతగా ఖర్చు చేయాలి కానీ వాటిని  మళ్లించుకుని జల్సాలు చేస్తున్నారని విమర్శించారు.రెండు శాతం నిధులను సీఎస్‌ఆర్‌ నిధులను  వివిధ కంపెనీలు స్థానికంగా ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం  కేటాయిస్తాయన్నారు. ఆ నిధులను అధికారాన్ని అడ్డం పెట్టుకుని  యనమల ఫౌండేషన్‌కు మళ్లించుకుని, పిల్లలకు పెన్సిళ్లు, బ్యాగులు ఇచ్చి విస్తృత ప్రచారం చేసుకున్నారని అన్నారు. సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు చూపించి రూ.కోట్లు దోచుకున్నారని విమర్శించారు.

 

ఈ సంధర్బంగా ఆయన  ఈ ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు తీరప్రాంత డ్రైనేజీ సమస్యపై అప్పట్లో ధర్నా చేసి హడావుడి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీని తర్వాత  డ్రైనేజీ సమస్యను టీడీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్నా పట్టించుకోలేదన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్న ఈ ప్రాంత నేత కూడా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం డెంగీ, వైరల్‌ జ్వరాలకు నిలయంగా మారిందన్నారు. ఏడాదిలోగా జమ్మేరు కాలువల ఆధునికీకరణ చేసి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే అన్నారు.అనంతరం డ్వాక్రా మహిళల సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు రూ.3.20 కోట్ల చెక్కును మండల మహిళా సంఘానికి అందజేశారు.

 

తొలుత పంపాదిపేట, బుచ్చియ్యపేట గ్రామాల్లో గ్రామ సచివాలయాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.పెరుమాళ్ల పురంలో డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించడంతోపాటు మండలానికి పీజీ, జూనియర్‌ కళాశాల మంజూరుకు కృషి చేస్తానన్నారు. తొండంగి మండలంలోని అత్యధికంగా పూరి గుడిసెలు ఉన్నాయన్నారు. పార్టీ, కుల, మత వర్గ బేధం లేకుండా అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు నిర్మిస్తామన్నారు.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: