వైఎస్ జగన్ ఆరు నెలల పాలనపై జనాలు  ఏమనుకుంటున్నారు పాలన ఎలా ఉంది అనే విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.  ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ నవరత్నాలు పేరుతో హామీలు ఇచ్చారు.  అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను అమలు చేస్తున్నారు.  నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా జగన్ అమలు చేస్తూ వస్తున్నారు.  ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని అమలు జరిగింది అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  
అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్ మొదట వృద్ధాప్య పింఛన్ పధకంపై  సంతకం చేశారు.  పింఛన్ విధానంపై సంతకం చేసిన జగన్ దానిని అమలు చేసేందుకు అడుగులు ముందుకు వేశారు.  జగన్ పింఛన్ విధానం అమలు చేస్తూ వాటికి కావాల్సిన నిధులను ఏర్పాటు చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే వృద్ధాప్య పింఛన్ పధకం ఆపకూడదు అని అధికారులతో స్పష్టం చేశారు.  
అదే రోజున జగన్ ఉద్యోగాల విషయంలో కూడా ఓ ప్రముఖమైన మాటను వాడారు.  బాబు వస్తారు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పిన టిడిపి ప్రభుత్వం బాబు వచ్చినా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలం అయ్యింది.  కానీ, వైకాపా ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన రోజునే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నట్టు ప్రకటించింది.  దానికి అనుగుణంగానే ఆగుస్ట్ 15 వ తేదీన 2.5 లక్షల మంది గ్రామ వాలంటీర్ ఉద్యోగాలను కల్పించింది.  
ఆ తరువాత ప్రభుత్వం గ్రామసచివాలయ ఉద్యోగాలను కల్పించింది.  నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో ఖ్యాతి కెక్కారు.  ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకొని షార్ట్ పీరియడ్ లో నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్ కు దక్కుతుంది.  అందుకే అయన ప్రజల్లో హీరో అయ్యాడు.  యువతకు అన్న అయ్యారు.  ఆంధ్రప్రదేశ్ కు అభివృద్ధికి జగన్ కృషి చేస్తున్నారు అన్నది వాస్తవం అని చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: