డాక్టర్ ప్రియాంక రెడ్డి.. ఆమె గురించి విన్న ప్రతిఒక్కరి కంట కన్నీళ్లు.. కోపం కలిపి వస్తున్నాయి. జీవితంపై ఎన్నో ఆశలు.. ఆశయాలతో చదువుకొని.. డాక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియాంక రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేసి చెటాన్‌పల్లి బైపాస్‌ రోడ్డు అండర్‌ బ్రిడ్జి కింద పెట్రోలు పోసి దహనం చేశారు. అయితే అత్యంత దారుణంగా ఆమెని అత్యాచారం చేసిన చంపినా నిందితులను పోలీసులు షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు.        

 

అయితే ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా నాయకుల నుండి రాజకీయ నాయకుల వరుకు ప్రతి ఒకరు ఆమెకు సంతాపం తెలుపుతు ఆమె తల్లిదండ్రులను పరామర్శిస్తున్నారు. ఆ నీచులను ఒదిలే ప్రసక్తే లేదు అని, ఖచ్చితంగా శిక్ష విధిస్తాం అని చెప్తున్నారు.                      

 

ఈ నేపథ్యంలోనే షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ ముందు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. దీంతో కట్టలు తెంచుకున్న కోపంతో నిరసనకారులు షాద్‌నగర్ పోలీస్ స్టేషన్, పోలీసులపై చెప్పులతో దాడి చేశారు. దీంతో నిరసనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి అందరిని అక్కడినుండి తరిమేశారు. 

 

అయినప్పటికీ లోపలికి వెళ్ళడానికి ఎంతోమంది నిరసనకారులు ప్రయత్నించారు. అయితే వారు లోపలి వెళ్ళడానికి ప్రయత్నిస్తే వారిని తోసేసి పోలీస్ స్టేషన్ కి తాళాలు వేసేకి ప్రయత్నించారు. అయితే అవి అందుబాటులో లేకపోవడంతో దానికి బేడీలు వేశారు. ఆ మానవ మృగాలను మాకు అప్పగించండి మాపై కేసు పెట్టండి అంటూ పోలీసులపై జనాలు విరుచుకుపడుతున్నారు. చంపేస్తాం ఆ నీచులను మీరు ఏమి చెయ్యలేరు మేము చంపేస్తాం మాపై కేసులు పెట్టుకోండి అంటూ నిరసనలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: