సరిగ్గా ఆరు నెలల క్రితం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో రాష్ట్ర ప్రజల్లో అంతా ఆనందమే కానీ ఎక్కడో ఒక చిన్న అనుమానం. మొట్టమొదటిసారిగా బాధ్యతలు అందుకున్న ఈ యువ నేత తమకిచ్చిన హామీలను నెరవేర్చగలడా..? కొన్ని దశాబ్దాల అనుభవం ఉన్న ప్రతిపక్షాన్ని సమర్థంగా ఎదుర్కొని ప్రజాహిత పాలన చేయగలడా అని. అయితే అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ జగన్ సీఎం గా తన ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించాడు.

 

రంగంలోకి దిగిన వెంటనే తాను పాదయాత్ర లో ఇచ్చిన ఒక్కొక్క హామీని ఎంతో నిర్దిష్ట తో దశలవారీగా అమలుచేస్తూ ఒక ప్రణాళిక ప్రకారం సాగుతున్నాడు. నిరుద్యోగ నిర్మూలన నుండి మద్యపానం పై ఉక్కుపాదం మోపే వరకు జగన్ తన శక్తికి మించి కష్టపడిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరువరు అన్న విషయం ప్రతిపక్షం మాత్రం ఏ దశలోనూ తెలుసుకోలేకపోతుంది. అసలు ప్రతిపక్షం బాధ్యత అధికారపక్షం చేత మరింత గొప్పగా పనులు చేయించడమే కానీ వారు చేస్తున్న పనులకు అడ్డుకట్టవేసి అమాయకులు కడుపు కొట్టడం కాదన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు.

 

ఉదాహరణకు ప్రాధమిక మరియు మాధ్యమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రతిపాదనను జగన్ ఎంతో ముందు చూపుతో వెల్లడించగా మిగతా పార్టీలన్నీ మూకుమ్మడిగా కలిసి అతనిపై దాడి చేయడం ఎంతో విచిత్రంగా ఉందని ప్రజల మాట. ఇప్పటివరకు ధైర్యంగా హామీలు ఇవ్వలేక మరియు ఇచ్చిన హామీలను నెరవేర్చే లేక ఎంతో అప్రతిష్టత మూటకట్టుకోవడంతో పార్టీలన్నీ జగన్ ని కూడా తమ ఊబిలోకి లాగే ప్రయత్నం చేస్తుండగా మన ముఖ్యమంత్రి వాటన్నింటినీ తట్టుకుని ఎదురుచూస్తూ మరిన్ని సంక్షేమ పథకాలకు బాట వేస్తుండటం ఆదర్శనీయం. జగన్ ఆరు నెలలు చేసిన మంచిని ఆరు తరాల వారు గుర్తు పెట్టుకొని కేవలం మంచి రాజకీయ నాయకులనే ఎన్నుకోవాలి అని ప్రతీ ఒక్కరి ఆశ.

మరింత సమాచారం తెలుసుకోండి: