నిండా అవినీతిని పులుముకుని, అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు.  ప్రమాణస్వీకార వేదికపై నుంచి ‘ఆరునెలల్లోగా మీ అందరిచేత మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా’ అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించినపుడు రాష్ట్రప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఖాళీ ఖజానా.. గాడిలో లేని పాలన.. అన్ని రంగాల్లోనూ అవినీతి విశృంఖలత. ఇలాంటి పరిస్దితుల్లో బాద్యతలు చేపట్టిన ఏ ముఖ్యమంత్రి ఐనా ఏం చేస్తారు. ప్రజలపైనా అధిక పన్నుల భారంవేసి పీడించుకు తింటారు.

 

 

కాని జగన్ పరిపాలనలో, తొలి అడుగే సంక్షేమ సంతకం నుండి మొదలైంది.. నాటి నుంచి వడివడిగా అడుగులు పడుతూనే ఉన్నాయి. వరుసగా సంక్షేమ పథకాలు.. అన్ని వర్గాలకు లబ్ది చేకూరేలా కీలకమైన నిర్ణయాలు వెలువడుతూనే ఉన్నాయి. ఈ సమయంలో ప్రతిపక్షం, మీడియా అంతా ఏకమై చేస్తున్న వ్యతిరేక ప్రచారం ఆకాశాన్నంటింది. అయినా అన్నిటినీ తట్టుకుని తాను పెట్టుకున్న గడువు నాటికి కనీవిని ఎరుగని విజయాన్ని అందుకున్నాడు జగన్‌..

 

 

ప్రాంతాలను, పార్టీలను, పట్టించుకోలేదు. కులాలు, మతాలు చూడలేదు. అందరికి మంచి చేయడమే తన లక్ష్యం అన్న దిశగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. అందుకు సాక్ష్యం శాచురేషన్‌ స్థాయిలో అమలవుతున్న పథకాలే అని చెప్పవచ్చూ. ఇన్నాళ్ల నుండి  మాటలు చెప్పిన వారినే చూసిన ప్రజలు ఇక జగన్ ఏం చేస్తాడులే అని అనుకున్నారు. కాని జగన్ అంటే జనం జనం అంటే జగన్ అని నిరూపించాడు.

 

 

ప్రతి పేదవాడి నుండి ముసలి వారివరకు. ఉద్యోగి నుండి నిరుద్యోగి వరకు చెతులెత్తి మొక్కాలనిపించేలా తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకునాడు. ఇది చాలదా ప్రతి పక్షాల నోరు మూయించడానికి. వెనకడుగు వేయకుండా ఎదురుగా ఉన్న సమస్యలను ఒక్కోక్కటి పరిస్కరించుకుంటూ ఏపీలోని ప్రజల కన్నీరును అన్నలా తుడుస్తున్నాడు. తన తండ్రి బాటలో నడుస్తూ సేవ అనే పదానికి సాక్ష్యంగా నిలుస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: