వైఎస్ జగన్ ఏం చేసినా అది ప్రజల కోసమే.. ప్రజల సంక్షేమం కోసమే.  ప్రతి పథకం కూడా ప్రజలకు చేరువ కావాలని, ప్రజలకు మంచి జరిగేలా చూడాలని అనుకున్నారు.  అందుకోసమే జగన్ కొన్ని ముఖ్యమైన పథకాలకు రూపకల్పన చేశారు.  అలాంటి వాటిల్లో ఒకటి ఇంగ్లీష్ మీడియం విద్య.  ప్రపంచం ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయ్యింది.  మాతృ భాషలో మాత్రమే విద్యను అభ్యసించిన వ్యక్తులకు అవకాశాలు పెద్దగా దొరకడం లేదు అన్నది వాస్తవం.  
వారి పరిధి కొంతమేరకు మాత్రమే ఉన్నది.  రాష్ట్ర స్థాయిలో మాత్రమే ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతున్నారు.  ఇప్పుడు రాష్ట్రంలో కూడా అనేక కార్యాలయాల్లో ఇంగ్లీష్ అవసరం ఉన్నది.  ఎలాంటి అప్లికేషన్ పూర్తి చేయాలన్నా కూడా దానికి ఆంగ్లం రావాల్సి ఉంటుంది.  లేదంటే ప్రతి చిన్న విషయానికి కూడా మరొకరిపై ఆధారపడి ఉండాల్సి వస్తుంది.  దీనిని గమనించిన ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఆంగ్ల విద్య అందుబాటులోకి రావాలి అనే ఉద్దేశ్యంతో ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు.  
ఆంగ్లభాషలో ప్రతి ఒక్కరు ప్రావిణ్యం సంపాదిస్తే.. వారికీ అవకాశాలు వస్తాయి.  ఒకచోట కాకపోయినా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉద్యోగాలు వస్తాయి.  ఇంగ్లీష్ బాష అవసరం ఇప్పుడు చాలా ఉన్నది.  ప్రైవేట్ స్కూల్స్ లో చేరి ఇంగ్లీష్ విద్యను అభ్యసించాలి అంటే కొంత ఇబ్బంది ఉంటుంది.  డబ్బు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.  ఆ డబ్బు అందరికి దగ్గరా ఉండదు అందుకే ప్రభుత్వమే ఇంగ్లీష్ విద్యను తీసుకురావాలని అనుకున్నది.  
సామాన్య ప్రజల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నది.  ప్రజలు ఈ పధకాన్ని మెచ్చుకున్నారు.  పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి పధకం తీసుకొచ్చారని, మరి అలాంటప్పుడు ఎందుకు ఇలా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయో తెలియడం లేదు.  ఇలా రాద్ధాంతం చేయడం వలన వచ్చిన ప్రతి పక్షాలు ఏమైనా లాభం పొందాయా అంటే అదీలేదు.  ప్రజలకు ఉపయోగపడే పధకాలు ప్రవేశపెట్టడం వలన ప్రజలకు మంచి జరుగుతుంది తప్పించి నష్టం లేదు కదా.  

మరింత సమాచారం తెలుసుకోండి: