2019 ఎన్నికలు భారీ మెజారిటీ ని సంపాదించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి . జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పాలనను గాడిలో పడింది అని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఎన్నో సంక్షేమ వినూత్న పథకాలతో ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరో వైపు జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలు జగన్మోహన్రెడ్డిపై విమర్శలతో విరుచుకు పడుతూనే ఉన్నాయి. అయితే జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో  సమస్యలు ఉన్నాయని అందుకే  పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ పాలసీ కి వెళ్తున్నామని జగన్ ప్రభుత్వం చెప్పగా...  రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును జగన్ సర్కార్ నిర్వీర్యం చేస్తుందంటూ విమర్శలు గుప్పించారు. 

 

 

 

 ఇక అధికార వైసీపీ నేతలు టిడిపి శ్రేణులపై  దాడులకు పాల్పడుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు. వైసీపీ బాధితుల ఆదుకుంటామని   అధికార పార్టీ నేతలు ఎంతో  మంది టీడీపీ శ్రేణులపై  40 దాడులకు పాల్పడుతున్నారు అంటూ  విమర్శలు గుప్పించారు . ఆ తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత సమస్య పజగన్ ప్రభుత్వం అసమర్థత వల్లే వచ్చిందని... అధికార పార్టీ నేతలందరూ అక్రమ ఇసుక రవాణా కు పాల్పడడం వల్లే రాష్ట్రంలో సమస్య ఏర్పడిందని... తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి  విపక్ష పార్టీలు. ఇసుక కొరత  సమస్య పై ఎన్నో నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. 

 

 

 

 కాగా తాజాగా జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రవేశపెట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై  విపక్ష పార్టీలన్నీ దుమ్మెత్తి పోస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో  ఇంగ్లీష్ మీడియం నిర్ణయం  రాష్ట్రంలో తెలుగు భాష నిర్వీర్యం చేసేలా ఉందంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో తెలుగు భాష మసకబారేలా  చేసేందుకే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎట్టి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి సర్కారును రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్రెడ్డి ఆరునెలల పాలనలో దాడులు మోసాలు తప్ప ఏమీ లేవంటూ పక్ష పార్టీలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: