ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక జగన్ అనేక సంక్షేమ ఫలాలు అందిస్తు లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రంలో కూడా ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చే విధంగా మద్యపానాన్ని దశలవారీగా నిషేధిస్తూ అద్భుతమైన పరిపాలన అందిస్తూ ప్రజల చేత శభాష్ అనిపించుకుంటున్న ట్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జనం మాటలు వింటే తెలుస్తుంది. జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఆరునెలలు కావస్తున్న నేపథ్యంలో… 2019 ఎన్నికల ఫలితాలు వచ్చాక ప్రధాని మోడీ ని కలిసిన సందర్భంలో జగన్ మీడియా సమావేశం నిర్వహించి తనపై అమితమైన నమ్మకంతో భారీ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన గెలుపుకు కృతజ్ఞతలు చెబుతూ … తన పరిపాలన సంవత్సరం లోపే మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారని ఆంధ్ర ప్రజల చేత అనిపించుకుంటాను అని తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యి ఆరు నెలలు అయిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలు జగన్ పరిపాలన పై చాలా సంతృప్తికరంగా ఉన్నట్లు చాలాచోట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

అయితే ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో జగన్ ప్రత్యర్థి పార్టీలకు బుద్ధి చెప్పిన ప్రజలు తాజాగా జగన్ పై మతం రంగు మరియు అదే విధంగా కులం రంగు రాసి రాజకీయాలు చేయాలనుకుంటున్నా నీచమైన రాజకీయ నేతల వ్యాఖ్యలపై మండిపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనం. జగన్ పై ప్రత్యర్థులు చేస్తున్న కామెంట్లను గురించి కొంతమంది ఏపీలో ఉన్న జనం ఈ విధంగా స్పందించారు. జగన్ తండ్రి వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్న క్రమం లో అద్భుతంగా ప్రజల జీవితాలు ఉన్నాయని ఆ తర్వాత వాళ్ల తండ్రి వైఎస్ చనిపోయాక రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది అందరికీ తెలుసు అంటూ… కానీ ఆ సందర్భంలో తన తండ్రి చనిపోయిన మరణాన్ని దిగమింగుకుని మా కోసం మా కష్టాల కోసం ఎప్పుడు ఎక్కడ ఏది జరిగినా అక్కడ కేవలం ముందుగా స్పందించిన వ్యక్తి జగన్ అని...ఇప్పుడు జగన్ మతం పై గాని మరియు కులంపై గాని చేస్తున్న రాజకీయ నేతలు ఎవరూ కూడా అప్పట్లో మేము పడుతున్న కష్టాల సమయంలో ఎవరు మా దగ్గర లేరు జగన్ మాత్రమే ఉన్నారు...అందువల్లనే 2019 ఎన్నికల్లో ఆయనకి అంత మెజార్టీతో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం జరిగిందని పబ్లిక్ జగన్ గురించి కామెంట్ చేస్తుంది.

 

అయితే ప్రస్తుతం జగన్ … పరిపాలనలో రాష్ట్రంలో ప్రతి సామాన్యుడికి మేలు చేకూరే విధంగా అద్భుతమైన పరిపాలన అందిస్తుంటే మరోపక్క కొన్ని రాజకీయ నీచమైన నేతలు మతం పేరుచెప్పి కులం పేరు చెప్పి అదేవిధంగా భాష పేరు చెప్పి ప్రజలలో జగన్ పై వ్యతిరేకత తీసుకురావాలని భావిస్తున్నారు...గతంలో వారు మాట్లాడిన మాటలు ఇప్పుడు తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను ప్రభావితం చేసే సున్నితమైన అంశాలను వాడుకుంటున్నారు వారికి 2019 ఎన్నికల్లో ఏ విధంగా బుద్ధి చెప్పడం జరిగిందో అదేవిధంగా రాబోయే భవిష్యత్తులో కూడా కనుమరుగయ్యే విధంగా బుద్ధి చెబుతాం అంటూ జగన్ అందరివాడు అని తన పరిపాలనలో ఏ ఒక్క మతానికి ఏ ఒక్క కులానికి లబ్ధి చేకూరే విధంగా పరిపాలన లేదని ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని...కుర్ర ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే ఎలా ఉంటుందో జగన్ పరిపాలన చూస్తుంటే ఆ విధంగా ఉందని ఏపీ లో ఉన్న జనం జగన్ అందరివాడు అని అంటున్నారు.

 

రాష్ట్ర విభజనతో నష్టపోయి ఇప్పటికెఆంధ్ర ప్రజలు విసుగు చెందారు … గత ప్రభుత్వంలో ఇంకా విసుగు చెందారు...కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అనవసరపు ఖర్చులు తగ్గించుకుని ప్రజల సంక్షేమం కోసం అద్భుతంగా ఉన్నదాంట్లోనే అన్ని విధాల ఆలోచిస్తూ కర్చు పెడుతున్నారు అంటూ ఏపీ లో ఉన్న జనం సంతృప్తికరంగా జగన్ పరిపాలన పట్ల ఉన్నట్లు తమ అభిప్రాయాలని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: