సాధారణంగా ఏపీలో వారసత్వ రాజకీయాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఒకే కుటుంబం నుంచి అనేక మంది నాయకులు పుట్టుకొస్తారు. తరతరాలు వారే రాజకీయాల్లో ఉండాలని అనుకుంటారు. పైగా ప్రతి రాజకీయ నాయకుడు తమ కుమారులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటారు. అవసరమైతే ఎన్నికల సమయంలో తమ సీట్లని సైతం త్యాగం చేసి కుమారులని పోటీలో నిలపడానికి చూస్తారు. మొన్న ఎన్నికల్లో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. అందులోనూ టీడీపీలో ఎక్కువగా కనిపించాయి.

 

టీడీపీలో సీనియర్ నేతలుగా ఉన్న krishna REDDY' target='_blank' title='gopala krishna-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల గోపాల కృష్ణ రెడ్డి, కాగిత వెంకట్రావు, పరిటాల సునీత లాంటి వారు ప్రత్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకుని ఫలితం ఎలా వచ్చిన తమ తనయులకు అవకాశం దక్కేలా చేసుకున్నారు.  అయితే కొందరు నేతలు అయితే తమ వారసులకు తర్వాత చూద్దామని వారే మళ్ళీ పోటీలో దిగి ఓటమి పాలయ్యారు. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం తమ వారసులని ఖచ్చితంగా బరిలో దించాలని విశాఖకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు భావిస్తున్నారు.

 

అవసరమైతే తాము తప్పుకునైనా సరే కుమారులకు అవకాశం దక్కేలా చేయాలని మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తిలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు టీడీపీలోనే రాజకీయ జీవితం మొదలుపెట్టారు. బండారు 1989, 1994, 1999, 2014 ఎన్నికల్లో గెలిచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. ఇక మొన్న ఎన్నికల్లో ఈయన మరోసారి పెందుర్తి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి మాత్రం తన తనయుడు అప్పలనాయుడుని ఎన్నికల బరిలో దించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఇప్పటికే టీడీపీలో యాక్టివ్ గా ఉన్న అప్పలనాయుడుకు నియోజకవర్గంలో బాగానే ఫాలోయింగ్ ఉంది. అటు ఆరు సార్లు నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యే గా గెలిచిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు...మొన్న ఎన్నికల్లోనే తన తనయుడు విజయ్ కి టికెట్ ఇప్పించుకోవాలని అనుకున్నారు. కానీ బాబు ఒక్కరికే టికెట్ ఇస్తానని చెప్పడంతో అయ్యన్న మళ్ళీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి తను పోటీ చేయకపోయిన పర్లేదు గానీ తనయుడుని మాత్రం పోటీకి దించాలని అనుకుంటున్నారు. మొత్తానికి ఈ ఇద్దరు సీనియర్లు తనయుల కోసం త్యాగం చేయాలని చూస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: