జగన్ ఆరు నెలల కాలంలో ప్రవేశ పెట్టిన అనేక పథకాల్లో రైతు భరోసా ఒకటి.  ఈ పధకం అమలు చేసే విషయంలో ప్రతిపక్షాలు తీవ్రమైన విమర్శలు చేశాయి.  15వేలు ఇస్తామని అన్నారు.. కేంద్రం నుంచి వచ్చి మొత్తం కలిపి ఇప్పుడు 13500 ఇస్తామని అంటున్నారు.  ఇదెక్కడి విచిత్రం ఇలా చేయడం ఏంటి అని ఒక్కొక్కరు ఒక్కోరకంగా మాట్లాడుకున్నారు.  టీడీపీ ప్రభుత్వం వైకాపాపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి దూషించింది.  
కానీ, జగన్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి తొందరపాటు లేకుండా అన్నింటిని లెక్క చూసుకొని రైతులకు ఎంత ఇవ్వగలం అని లెక్కకట్టుకొని అడుగు ముందుకు వేసింది.  సక్సెస్ అయ్యింది. అక్టోబర్ 15 వ తేదీన రైతు భరోసా పధకాన్ని ప్రారంభించింది.  ఈ పధకం కింద అర్హులైన పేద రైతులకు వారి అకౌంట్ లోని నేరుగా 15వేలరూపాయలు వేశారు.  అలా వచ్చిన డబ్బుతో వ్యవసాయానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేసి రైతులు మరింత ఉత్సాహంగా పంటలు పండించేందుకు సిద్ధం అవుతున్నారు.  
రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది.  అందుకే ఈ పధకాన్ని జగన్ ప్రవేశపెట్టారు.  గత ప్రభుత్వాలు రైతులను పెద్దగా పట్టించుకోలేదు.  రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా లెక్కలు వేసుకుంటూ కూర్చున్నాయి తప్పించి ఎక్కడా కూడా వారికోసం చేసింది ఏమిలేదు.  రైతు రుణమాఫీ పేరుతో గత ప్రభుత్వం ఎదో చేయాలనీ చూసినా అమలు విషయంలో బొక్కబోర్లా పడింది.  రుణమాఫీ పధకం అన్నప్పుడే ఆ పధకం అమలు చేయడం సాధ్యం కాదని జగన్ చెప్పిన సంగతి గుర్తు చేసుకోవాలి.  
లక్షల రూపాయలు మాఫీ చేయడం అంటే మాములు విషయం కాదు.  చేయలేని, మోయలేని హామీలను జగన్ ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వలేదు.  అనుగుణమైన పథకాలను మాత్రమే జగన్ ప్రభుత్వం ఇచ్చింది. ఎన్నికల నవరత్నాల్లో ఒకటిగా ఈ పధకాన్ని ప్రవేశపెట్టి ఈ పధకాన్ని సక్సెస్ చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.  ఈ పధకం సక్సెస్ కావడంతో రైతులు ఆనందానికి హద్దులు లేవు.  అన్నదాత బాగుంటేనే అన్నపూర్ణ రాష్ట్రంలో ఉంటుంది.  అన్నపూర్ణ ఉంటేనే రాష్ట్రం పచ్చగా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: