డబ్బులుంటే చాలు స్టైలిష్ గా ఉండే బైకులు, కార్లు కొనడం.. రోడ్లమీదకు వాటిని తీసుకొచ్చి ఇష్టారాజ్యంగా నడపడం. ఎంతమంది చచ్చిపోలే..
... మితిమీరిన వేగం.. భీభత్సమైన నిర్లక్ష్యం.. ఫుల్లుగా మందుకొట్టి నడపడం ఈమధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది. కొంత మంది రిచ్ పీపుల్ ఉంటారు.. వారు లక్షల్లో, కోట్లల్లో డబ్బులు పెట్టి కార్లను కొంటారు.. కానీ డ్రైవింగ్ నేర్చుకోరు... లైసెన్సులు ఉండవ్.. నెంబర్ ప్లేటుల మీద బండి నంబర్లు తప్ప అడ్డవైనా రాతలు ఉంటాయి.

అటువంటి వారిలోని ఒకరి గురించే.. మనం ఇప్పుడు చెప్పుకోబొయేది.. వివరాల్లోకి వెళితే
. గుజరాత్ నివాసి అయిన ఒక వ్యక్తి విలాసవంతమైన కారుని కొన్ని కోట్లు పెట్టి కొన్నాడు. ఆ కారు కంపెనీ ఏంటంటే.. పోర్షే.. మోడల్ 911.. దాని విలువ దాదాపుగా 2 కోట్లకు పైగానే ఉంటుంది. అయితే ఆ వ్యక్తి తన పోర్షే 911 స్పోర్ట్స్‌ కారును శుక్రవారం నెంబర్ ప్లేట్‌ లేకుండానే అహ్మదాబాద్‌ రోడ్లపైకి తీసుకొచ్చాడు. అప్పుడు గుజరాత్‌లోని అహ్మబాద్‌లో హెల్మెల్‌ క్రాస్‌రోడ్‌ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఈ మెరిసే కారు కనిపించి. దానికి నెంబర్ ప్లేట్ కూడా లేదు కాబట్టి అడ్డంగా బుక్ అయ్యాడు డ్రైవర్.. వెంటనే పోలీసులు కారుకు అడ్డుపడి పక్కకు తీయమన్నారు. ఆ తర్వాత ద్రువ పత్రాలను చూపించవల్సిందిగా డ్రైవర్ ని కోరారు. కానీ అతను దగ్గర కారుకు సంబంధించిన ఏ పత్రాలు లేవు.. దాంతో.. పోలీసులు ఆ కారు డ్రైవర్ ని అడిగి బండి నెంబర్ తెలుసుకొని.. అది ఎన్నిసార్లు ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంగించిందో చెక్ చేసారు..


అప్పుడు వారికి తెలిసిన విషయం ఏంటంటే.. ఆ కారు గతంలో ఎన్నోసార్లు ట్రాఫిక్ రూల్స్ ను  ఉల్లంఘించిందని. దాని మీద ఉన్న మొత్తం జరిమానా ఎంత అంటే.. అక్షరాల 9 లక్షల 80 వేల రూపాయలు. ఒక్కసారిగా ఇది తెలుసుకున్న పోలీసులు ఖంగుతిన్నారు.. తర్వాత తేరుకొని కారుని స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. జరిమానా కట్టిన తర్వాత నే కారుని తీసుకెళ్లాలని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: