గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అద్భుత విజయం సాధించి ఏపీ పగ్గాలు చేపట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కనీవినీ ఎరుగని విజయం సాధించిన వైఎస్సార్సీపీ అధికారం చేపట్టింది. ఈ విజయంలో జగన్ తో ఇన్నేళ్లూ వెంట నడచిన నాయకులు, కార్యకర్తల పాత్రను తక్కువగా చూడలేం. ఎన్నో విమర్శలు, సవాళ్లను ఎదుర్కొన్న జగన్ మొన్నటి ఎన్నికల్లో విజయం నిజాయితీగా పడ్డ కష్టానికి ప్రతిఫలం లాంటిది. ఈ కష్టాన్ని ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ పాలనపై దృష్టి పెట్టి ప్రజాభీష్టం మేరకు నడుచుకుంటున్నారు. అయితే.. ఇటివల జరుగుతున్న కొన్ని పరిణామాలపై ఆయన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

 

 

పార్టీ కార్యకర్తల ఉత్సాహాన్ని తక్కువ చేయలేం కానీ.. అత్యుత్సాహం మాత్రం సరికాదు. అనంతపురం జిల్లాలో ఓ పంచాయతీ కార్యాలయానికి ఉన్న జాతీయ జెండాపై వైసీపీ జెండా రంగు వేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. మహాత్మా గాంధీ విగ్రహ దిమ్మకు కూడా వైసీపీ జెండా రంగులు వేశారు. ఇవన్నీ వెలుగులోకి రావడం వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతోంది. వీటిపై ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా రెండు పాత్రలు పోషిస్తున్న జగన్ దృష్టి పెట్టాల్సిన అవసరముంది. కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నామన్న ఆలోచన వారిలో నింపాల్సిన అవసరముంది.

 

 

ఐదేళ్ల పాటు ప్రజలకు ఎన్ని మంచి పనులు చేసినా ఎన్నికల వేళ వారిచ్చే తీర్పే శిరోధార్యం. చంద్రబాబు ఓటమికి జన్మభూమి కమిటీలు ప్రధాన కారణమనే విషయం తెలిసిందే. పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ విషయాన్ని మరువకూడదు. ప్రజలు ఇచ్చే నిశ్శబ్ద తీర్పులో విజయం సాధించే విధంగా ఇప్పటినుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాలపై శ్రద్ధ పెడితే 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తున్న జగన్ కు అదేమంత కష్టం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: