కేరళ రాష్ట్రం లోని ఒక 11 ఏళ్ల కుర్రోడు ఇప్పుడు సూపర్ ఫేమస్ అయ్యాడు. ఎందుకంటే.. తన చిన్న వయసులోనే ఆ బాలుడికి తన సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలిసింది కాబట్టి. వివరాల్లోకి వెళితే.. యూపీఎస్‌ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పేరు అబీర్ తన సైకిల్ ను రిపేర్ చేయించడానికి ఒక సైకిల్ రిపేర్ చేసే మెకానిక్ వద్దకు తీసుకెళ్లాడు. అయితే ఆ రిపేర్ చేసే మెకానిక్.. అభిర్ సైకిల్ తీసుకున్న కొద్ది రోజుల తర్వాత నుంచి తన షాప్ ను తెరవడం మానేశాడు. పాపం ఈ అభిర్ మాత్రం తన సైకిల్ రిపేర్ చేసాడో లేదో అని ప్రతి రోజు షాప్ దగ్గరకు వచ్చేవాడు... కానీ ఆ షాప్ ఎప్పుడూ చూసిన మూసివుండడంతో.. నిరాశతో వెనుదిరిగే వాడు. ఇలా రెండు నెలలు పాటు తన సైకిల్ కోసం తిరిగి తిరిగి.. ఎంతకూ తన సమస్య పరిష్కారం కాకపోవడంతో.. చివరకు పోలీసులకు పిర్యాదు చేయాలని నిర్ణహించుకున్నాడు.

ఒక పెన్ను పేపర్ తీసుకొని.. 'నేను, మా తమ్ముడు మా సైకిల్‌ రిపేర్‌ కోసం సెప్టెంబర్‌ 5న ఒక దుకాణదారుడికి ఇచ్చాం. ఆ దుకాణదారుడు మా సైకిల్‌ను ఇప్పటి వరకు రిపేర్‌ చేయలేదు. మేం ఎన్నిసార్లు వెళ్లినా షాప్‌ మూసే ఉంటుంది. అంతేకాకుండా మా నుంచి రూ.200 తీసుకున్నాడు. సర్ మీరు ఇందులో జోక్యం చేసుకుని మా సైకిల్‌ ఇప్పించగలరు.' అని రాసాడు.

ఇక ఆ పేపర్ పట్టుకొని నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి అక్కడ కనిపించిన ఒక పోలీసు చేతిలో ఆ పిర్యాదు లేక పెట్టాడు. అది చదివిన అక్కడి పోలీసులు.. ఆ పిల్లోడిలోని ఆలోచన శక్తిని.. తన సమస్యను పరిష్కరించుకునే తెలివిని చూసి ముచ్చట పడ్డారు. తర్వాత సివిల్‌ పోలీసు అధికారి రాధిక రంగంలోకి దిగి..  ఆ పిల్లాడి సైకిల్‌ విషయంలో మెకానిక్‌ను ప్రశ్నించారు.. దాంతో ఆ మెకానిక్ కేవలం ఒక్కరోజులోనే సైకిల్ ను బాగుచేసి కుర్రోడికి ఇచ్చేసాడు. అభిర్ ఇచ్చిన పిర్యాదు లేఖను నెట్టింట షేర్ చేసి.. ఈ విషయాన్ని పోలీసులు తెలియచేసారు.. అప్పటినుంచి అభిర్ పిర్యాదు లేక వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: