దేశవ్యాప్తంగా ఉల్లి దిగుబడి  తగ్గిపోయింది. దీంతో ఉల్లికి భారీగా డిమాండ్ ఏర్పడింది. భారీగా డిమాండ్ ఏర్పడటంతో ఉల్లి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి . సామాన్య ప్రజలను ఉల్లి ధరలు  బెంబేలెత్తిస్తున్నాయి . అసలు ఉల్లి  వైపు చూడాలంటే సామాన్య ప్రజలు జంకుతున్నారు. ఉల్లి ధరలు  ఆకాశాన్నంటుతూ  భగ్గుమంటున్న తరుణంలో ఉల్లిని  కొయకుండానే సామాన్యుల కళ్ల  నుంచి నీళ్లు వస్తున్నాయి. ఇక రోజు వారి ఆహారంలో ఉల్లి తప్పనిసరి కాబట్టి కొంతమంది లబోదిబోమంటూనే  ఉల్లిని  కొనుగోలు చేస్తుంటే ఇంకొంతమంది ఉల్లి  లేకుండానే కానిచ్చేస్తున్నారు.కాగా ఉల్లి  ధర దాదాపు వందకుపైగా పలుకుతోంది. 

 

 

 

 దీంతో  దేశంలోని ఏ  రాష్ట్రంలో కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. అయితే దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలోని ప్రజలు ఉల్లి ధరలు ఆకాశాన్నంటడంతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సబ్సిడీతో తక్కువ ధరలకే ఉల్లిని అందజేస్తున్నారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇలాంటి చర్యలు చేపట్టాయి. అయితే దేశంలో ఉల్లిగడ్డ కొరతా ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇక్కడో ఘటన జరిగింది. విపణిలో  కేజీ ఉల్లి ధర 75 నుంచి 100 రూపాయల వరకు పెరిగి  సామాన్యులను కంటతడి పెట్టిస్తుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లోని మిద్న పూర్ లో ఓ  దొంగతనం జరిగింది. 

 

 

 

 రాత్రివేళ షాపుకు తాళం వేసిన యజమాని  అక్షయ్ దాస్ తర్వాత రోజీ  షాప్ తెరిచి చూసేసరికి లబోదిబోమన్నాడు. షాప్ లో గల్లపేట్టి  భద్రంగానే ఉంది. గల్లాపెట్టె భద్రంగా ఉంటే ఇంకా ఏంటి ప్రాబ్లం అంటారా... గల్లాపెట్టె భద్రంగానే ఉంది కానీ షాప్ లో ఉన్న 50 వేల విలువైన ఉల్లిగడ్డల బస్తాలు  మాయమయ్యారు. దీంతో షాపు యజమాని జరిగిన దొంగతనం తో లబోదిబోమన్నారు . కాగా ప్రస్తుతం బెంగాల్ మార్కెట్లో ఉల్లి ధర వందకుపైగా పలుకుతుండటం గమనార్హం. అయితే ఉల్లికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మొత్తంలో ఉల్లిని  తెచ్చి షాప్లో స్టాక్  చేసాడు అక్షయ్ దాస్ . ఉల్లి ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడే సొమ్ము చేసుకుందాం అని ఆశ పెట్టుకున్న అక్షయ్ దాస్  ఆశలపై చివరికి దొంగలు నీళ్లు చల్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి: