డబ్బు ఉంటె ఏదైనా చెయ్యొచ్చు.  మరి ఆ డబ్బు సంపాదించాలంటే చాలా కష్టం.  సక్రమమార్గంలో సంపాదించడం చాలా కష్టం.  అదే వక్రమార్గంలో వెళ్తే కావాల్సినంత డబ్బు.. దొరికినపుడు చూసుకుందాం అని చెప్పి తప్పుదారిలో వెళ్తూ తప్పులు చేస్తున్నారు.  చివరకు పెట్టుబడి జైలుకు వెళ్తున్నారు.  గత కొంతకాలంగా దేశంలో కొన్ని విషయాలు బడానేతలను, బడా పారిశ్రామిక వేత్తలను భయపెడుతున్నాయి.  అందులో ఒకటి వలపుల వల.  
దేనికి లొంగని వ్యక్తి కామానికి లొంగుతారు.. అంటే అమ్మాయికి లొంగుతారు.  దీనిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు కొందరు.  బెంగళూరులో ఇలాంటి వలలు వేస్తూ కొందరు అడ్డదిడ్డంగా డబ్బులు సంపాదిస్తున్నారు.  ఉత్తర కర్ణాటకకు చెందిన ఓ కీలక నేత వలపుల ఉచ్చులో చిక్కుకున్నారు.  అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే ప్రైవేట్ వీడియోలు బయటపెడతామని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు.  
ఈ కేసును పోలీసులు చాలా చాకచక్యంగా డీల్ చేశారు.  బంగళూరులో ఈ ముఠా నాయకుడిని, మరో ఇద్దరు మహిళను అదుపులోకి తీసుకున్నారు.  వీరిని విచారిస్తే అన్ని నిజాలు బయటకు వచ్చాయి.  టార్గెట్ చేసుకున్న వారి వద్దకు ఓ అందమైన అమ్మాయిని పంపిస్తారు. వీళ్లతో క్రమంగా సాన్నిహిత్యం పెంచుకున్న యువతి..ఏకాంతంగా గడుపుతామంటూ వారిని ఓ హోటల్‌‌కు రప్పిస్తుంది. అయితే.. గ్యాంగ్ సభ్యులు అంతకు మునుపే హోటల్‌కు చేరుకుని గదిలో రహస్య కెమెరాలు అమర్చి వెళ్లిపోతారు. యువతితో బాడా వ్యక్తులు ఏకంతంగా ఉన్నప్పుడు రికార్డు చేసిన వీడియోలను సహాయంతో బ్లాక్ మెయిలింగ్‌ చేస్తారట.  
ఇలా బ్లాక్ మెయిల్ చేసి వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేస్తారట.  ఈ ముఠాకు రాఘవేంద్ర అలియాస్ రఘు అనే వ్యక్తి నేతృత్వం వహిస్తున్నారు.  వీరిని అరెస్ట్ చేసిన తరువాత అన్ని నిజాలు బయటకు వచ్చాయి.  అయితే, ఉత్తర కర్ణాటక కు చెందిన ఓ బడానేత ఒక్కరినే ట్రాప్ చేసారా లేందంటే.. ఇంకెంతమందిని ఈ ముఠా ట్రాప్ చేసింది అనే విషయాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: