దేవినేని అవినాష్‌కు ఏ పార్టీలో ఉన్న కష్టాలు మాత్రం తప్పడం లేదు. మొన్నటివరకు టీడీపీలో ఉన్న అవినాష్‌కు భవిష్యత్తుపై అనుమానాలు వచ్చిన విషయం తెలిసిందే. అనవసరంగా చంద్రబాబు ఆదేశాలతో మొన్న ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అవినాష్....ఆ తర్వాత తనకు పట్టున్న విజయవాడ తూర్పులో గానీ, పెనమలూరులో గానీ ఇన్-చార్జ్ పదవి ఇవ్వమని అడిగారు. కానీ బాబు దీనిపై క్లారీటీ ఇవ్వకుండా అవినాష్‌కు చుక్కలు చూపించారు. పైగా తెలుగు యువత అధ్యక్షుడుగా పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుంటే లోకేషేనే డామినేట్ చేసేస్తున్నాడని, సొంత నేతల చేత క్లాస్ ఇప్పించారు. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో అవినాష్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు.

 

అటు చేరగానే జగన్... అవినాష్‌కు విజయవాడ తూర్పు బాధ్యతలు అప్పగించేశారు. అయితే జగన్ ఏమి ఉత్తిగానే బాధ్యతలు అప్పజెప్పకుండా ఓ పెద్ద టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్ సక్సెస్ అవుతాను అంటేనే ఇన్-చార్జ్ ఇస్తానని చెప్పి మరి బాధ్యతలు ఇచ్చారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడ తూర్పులో వైసీపీ క్లీన్ స్వీప్ చేయాలని జగన్ పరీక్ష పెట్టారు. అయితే చెప్పినంత సులువుగా ఇక్కడ వైసీపీ గెలవడం చాలా కష్టం. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్ట్రాంగ్ గా ఉన్నారు.

 

మొన్న ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచిన ఈయన మాత్రం 15 వేల మెజారిటీతో విజయం సాధించారు. మరి ఇలాంటి పరిస్తితుల్లో రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీని గెలిపించడం అంటే అవినాష్‌కు అగ్నిపరీక్ష లాంటిదే. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో తూర్పు పరిధిలో ఉన్న చాలా డివిజన్లలో గద్దెకు దాదాపు 2వేల ఓట్లపైనే పడ్డాయి. అలాగే కొన్ని డివిజన్లలో టీడీపీకి మంచి పట్టుంది. దీంతో అవినాష్ ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు.

 

ప్రతి డివిజన్ లో సమస్యని తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ వర్గం ద్వారా పట్టు సాధించేందుకు చూస్తున్నారు. అయితే తూర్పులో పట్టున్న వైసీపీ నేతలు బొప్పన భవకుమార్, యలమంచి రవిల వర్గాలని కూడా కలుపుకుంటూనే అవినాష్ అనుకున్న పని కొంతవరకు సక్సెస్ అవుతుంది. లేదంటే అంతే సంగతులు. మరి చూడాలి అవినాష్ ఈ అగ్నిపరీక్షలో పాస్ అవుతారో లేదో?

 

మరింత సమాచారం తెలుసుకోండి: