గత ఐదేళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు ఓ విషయంలో రికార్డు సృష్టించారు. అయితే ఆ రికార్డుని తాను సృష్టించి ప్రస్తుతం సీఎం జగన్ ఖాతాలో తోసేస్తున్నారు. ఇక అలా చంద్రబాబు సృష్టించిన రికార్డు ఏంటంటే గత ఐదేళ్లు దాదాపు 2.60 లక్షల కోట్లు అప్పు చేసి...ఇప్పుడు జగన్ చేసిన అప్పు విషయంలో కామెంట్ చేస్తున్నారు. తాజాగా ఆయన జగన్ ఆరు నెలల పాలన కాలంపై స్పందిస్తూ... 6 నెలల్లో వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అది అప్పుల్లో రికార్డు సృష్టించడం అన్నారు.

 

6 నెలల్లో దాదాపు రూ.25 వేల కోట్లు అంటే నెలకు సుమారు మూడున్నర వేల కోట్ల అప్పు చేసి ఒక్క అభివృద్ధి పనీ చేయలేదు అని మండిపడ్డారు. ఒక్క ఆగష్టులోనే 5 సార్లు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అయితే చంద్రబాబు ఈ కామెంట్లు చేసే ముందు....గత ఐదేళ్లలో ఏం చేశారో ఒకసారి తెలుసుకుంటే బాగుండేదేమో. ఆయన ఐదేళ్లు 2 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి బాగా హడావిడి చేసిన విషయం ప్రతిఒక్కరికి తెలుసు. పైగా కేంద్రం నుంచి సాయం అందిన దానిని ఏం చేశారో లెక్క లేదు.

 

ఇంత అప్పు చేసిన పథకాలు అయిన పూర్తిగా అమలు చేశారంటే అది లేదు. ప్రతి పథకంలోనూ కొర్రీలు పెట్టారు. అటు అమరావతి, పోలవరం నిర్మాణాల పేరిట వేల కోట్లలో నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఎన్నికల ముందు చంద్రబాబు అసలు ఆర్ధిక క్రమశిక్షణ పాటించలేదు. ఓటర్లని ఆకట్టుకోవడమే లక్ష్యంగా విచ్చల విడిగా పథకాలు పెట్టేశారు.

 

ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే బాబు తాజాగా చేసిన ట్వీట్ లో ఓ జాతీయ పత్రిక కథనం జత చేశారు. అందులో 7 నెలలకు 25 వేల కోట్లు అప్పు అని ఉంది. అందులో చంద్రబాబు పాలనలో ఉన్న ఏప్రిల్ నెలలోనే దాదాపు 5వేల కోట్లు అప్పు తీసుకున్నారని ఉంది. దీని బట్టి చూస్తే చంద్రబాబు ఏ విధంగా రాష్ట్రం మీద అప్పులు భారం పెట్టేశారో తెలుస్తోంది. కాబట్టి అప్పుల రికార్డుల్లో చంద్రబాబుని ఎవరు మించలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: