ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాల తర్వాత రెండు పార్టీల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. ఒకటి తెలుగుదేశం రెండు జనసేన. ఈ రెండు పార్టీలు ఒకటి కార్యకర్తల బలంతో రెండో పార్టీ అభిమానుల బలంతో... జగన్ ని ఇబ్బంది పెడతాయని గెలుస్తాయి అని భావించారు అందరూ కూడా... కాని ఇక్కడ అదేం జరగలేదు. జగన్ సునామి ముందు ఈ రెండు పార్టీలో సోది లో కూడా లేకుండా పోయాయి అనే మాట వాస్తవం, ముఖ్యంగా జనసేన అయితే ఒక్క స్థానానికి పరిమితం కావడం ఆ పార్టీలో ఎవరికి కూడా మింగుడు పడటం లేదు.

 

పవన్ రావాలి పాలన మారాలి అని ఎంతగా ప్రచారం చేసినా సరే అది జనాల్లోకి వెళ్ళలేదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తెలుగుదేశం పార్టీకి సహకరిస్తున్నారు అనే భావంలో పవన్ సొంత సామాజిక వర్గం కూడా ఉంది. ప్రస్తుతం ఆ పార్టీ విషయానికి వస్తే... పవన్ బలపడటం అనేది ఒక కల అంటున్నారు పరిశీలకులు. ఆయనకు అభిమానుల బలం ఉన్న విధానం... పవన్ కి ప్రాణం ఇస్తాం జగన్ కి ఓటేస్తాం వరకు వచ్చింది. ఇప్పుడు దానిని దాటుకుని పవన్ బయటకు రావడం అనేది దాదాపు గా కష్టమే.

 

దీంతో ఆ పార్టీలో ఉన్న కీలక నేతలు వారి దారి వారు చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. విశాఖ నుంచి పోటీ చేసిన మాజీ జెడి లక్ష్మీ నారాయణ, నాదెండ్ల మనోహర్, తోట చంద్ర‌శేఖ‌ర్‌ పార్టీ మారే అవకాశం ఉందనే వార్తలు ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలను కలవరపెడుతున్నాయి. వీరిలో ఒక్క నాదెండ్ల మినహా ఎవరూ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి కనపడటం లేదు. ఇక ఆయన కూడా రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా పవన్ కి బాయ్ బాయ్ చెప్పాలని వైసీపీ లేదా బిజెపి లో చేరాలని భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: