గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రాజకీయ భవిష్యత్తు ఏంటి ? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం గత కొన్ని రోజులుగా రాజకీయ పరిశీలకులకు కూడా ఇబ్బందికరంగానే ఉంది. ఆయన పార్టీ మారతాను అని ప్రకటించక ముందు... నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నారు.. ఆ తర్వాత ఒక ప్రముఖ పత్రిక వద్ద తాను వైసీపీలోకి వెళ్తున్నాను అన్నారు.. ఆ తర్వాత అనూహ్యంగా చంద్రబాబు ఇసుక దీక్ష చేసే రోజు నానా మాటలు అన్నారు.. అది ఒక వివాదం కావడం ఆయన్ను పార్టీ నుంచి పంపించడం, చంద్రబాబు సహా పలువురు నేతలు వంశీ మీద విమర్శలు చేయడం జరిగాయి.

 

ఇప్పుడు ఇది పక్కన పెడితే ఆయన వైసీపీలోకి వెళ్తే రాజీనామా చేస్తారు... మళ్ళీ జగన్ గన్నవరం నుంచి అవకాశం ఇస్తారు, గన్నవరం సీటు ఇవ్వకపోయినా ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఒకటి ఇస్తారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాని అందులో ఏ ఒక్కటి కూడా నిజం కాదనే విషయం నిదానంగా స్పష్టత వచ్చింది. ఇక వంశీ పోటీ చేయలేక తప్పుకునే అవకాశం ఉందని లేదా స్వతంత్ర అభ్యర్ధిగా అలాగే ఉంటారని కొందరు వ్యాఖ్యానించారు.

 

అయితే ఇక్కడ వంశీ ఆలోచన మరొకరకంగా ఉందని అంటున్నారు. ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారని త్వరలో ఈ నిర్ణయం ప్రకటిస్తారని అంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే పదవి రాజీనామా లేఖను వంశీ చంద్రబాబుకి పంపారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో స్పీకర్ ఛాంబర్ కి వెళ్లి ఇస్తారని అంటున్నారు. ఇక అక్కడి నుంచి వైసీపీకి అనుకూల౦గా రాజకీయాలకు దూరంగా వంశీ ఉంటారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

 

వంశీ ఈ నాలుగేళ్లు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉండి.. తిరిగి 2024 ఎన్నిక‌ల్లో తిరిగి రీ ఎంట్రీ ఇస్తార‌ని అంటున్నారు. మరి దీనిపై వంశీ ఏమంటారో ? ఆయన నిర్ణయం ఏ విధంగా ఉంటుందో ? చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: