తెలంగాణాలో ఉన్న సమస్యలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్పష్టంగా వివరంగా కూలంకషంగా తెలుసు. అక్కడ ఏ హామీ నెరవేరదు అనే విషయం కూడా చాలా మందికి స్పష్టత ఉంది. కెసిఆర్ ముఖ్యమంత్రిగా చాలా హామీలు నేరవేర్చలేకపోయారు. చివరకు ఆంధ్రప్రదేశ్ లో ఉల్లిపాయ... 25 రూపాయలకు ఇస్తే తెలంగాణాలో 40 రూపాయలకు ఇస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు గాని ఏ ఒక్క హామీ కూడా అక్కడ నెరవేరే పరిస్థితి లేదనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 

ఎవ‌రిని కించ‌ప‌ర‌చాల‌న్న ఉద్దేశం కాదు గాని మిషన్ భగీరధ నీళ్ళ దెబ్బకు ఖమ్మం జిల్లాలో సగం జనానికి చర్మ వ్యాధులు కూడా వచ్చాయని ఒక మహిళ మీడియా ముందు వ్యాఖ్యానించింది. కాని పాపం అక్కడి విపక్షాలకు ఏ ఒక్క సమస్యా కనపడదు.. ఆర్టీసి సమ్మె చేస్తుంటే... ఏ ఒక్కడు కూడా నిరాహార దీక్షలు చేయడానికి సిద్దపడలేదు. కార్మికులకు మద్దతుగా నేను ఉన్నాను అని చెప్పే నాయకుడు అక్కడ కనపడలేదు.

 

రాజకీయంగా కెసిఆర్ ని ఎదుర్కోవడం అంత సులువు కాదు... ఆయన కాండం నరికేసాడు... వేళ్ళు ఉన్నాయి కదా... మళ్ళీ నిలబడ వచ్చు కదా... కాని ఇదేమి అక్కడ లేదు... అస‌లు ఆ ఆలోచ‌న కూడా అక్క‌డ నేత‌ల‌కు త‌ట్ట‌దు. విప‌క్షాల్లో ఉన్న ఈ ఐనైక్య‌తే కెసిఆర్ కి వరంలా మారింది. రెండు నెలలు దీక్ష చేసి ఒక్క హామీని కూడా కార్మికులు నేరవేర్చుకోలేకపోయారు. పైగా 30 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. విధుల్లో చేరమని కెసిఆర్ చెప్పగానే పాలాభిషేకం చేసారు కార్మికులు. వాళ్లకు నెరవేరిన హామీ ఏమీ లేదు.

 

కెసిఆర్ ఎప్పటిలానే సెంటిమెంట్ అనే అస్త్రాన్ని వాడి మీరు నా బిడ్డలు అన్నారు... నేను కుటుంబానికి పెద్దన్న అన్నారు... ఒక్క మాటలో చెప్పాలి అంటే విపక్షాలను కెసిఆర్ చంపేశారు... ఏ ఒక్క సమస్య మీద పోరాడకుండా వాళ్ళను వాళ్ళే చంపుకున్నారు... ఆర్టీసి సమ్మెలో కెసిఆర్ కార్మికులకు దేవుడు అయిపోయాడు. ఏదేమైనా ఇప్ప‌టికే స‌గం చ‌చ్చిన విప‌క్ష నేత‌ల‌ను ... కేసీఆర్ ఇక పూర్తిగా చంపేశారు. వాళ్ల‌కు తెలంగాణ రాజ‌కీయాల్లో క‌నుచూపు మేర‌లో కూడా ఫ్యూచ‌ర్ క‌న‌ప‌డ‌డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: