ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించినప్పటి నుండి రాష్ట్ర ప్రజల్లో తమకు మంచి రోజులు రాబోతున్నాయని భావన మొదలైంది అనే చెప్పాలి. మాట తప్పని వ్యక్తిగా మడమ తిప్పని మనిషిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న జగన్ ప్రజల్లో విపరీతమైన కాన్ఫిడెన్స్ నింపారు అన్న విషయం లో ఎలాంటి సందేహం లేదు. అయితే కాన్ఫిడెన్స్ మాట అటుంచితే కాన్ఫిడెన్షియల్ జీవోల విషయంలో మాత్రం జగన్ ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో కొత్త రికార్డు సృష్టించింది అని పలువురు చెబుతున్నారు. 

 

సరిగ్గా లెక్కేస్తే 6 నెలలు అంటే 180 రోజుల్లో ఏకంగా 90 రహస్య జీవోలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం విడుదల చేశారు. ఈ లెక్కన రెండు రోజులకి ఒక రహస్య జీవో విడుదల కావడం అన్న విషయం అది పెద్ద రికార్డు అనే చెప్పాలి. అంటే జగన్ ప్రభుత్వం ఆరు నెలల పాలన అంతా రహస్యంగానే సాగిందా అన్న డౌటు మనందరికీ రావచ్చు. కానీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ విడుదల చేసిన జీవోలకు ఊతంగా మరియు అవి సక్రమంగా అమలు పరిచేందుకు ఆసరాగా ఉండేందుకు వీటిలో దాదాపు అత్యధిక భాగం రహస్యంగా విడుదల అయ్యాయని భోగట్టా. 

 

కొంతమంది పారదర్శకత అనే మాటకు జగన్ పాలనలో స్థానం లేకుండా పోయిందని ఆరోపణలు చేస్తున్నారు కానీ ఇలా రహస్యంగా విడుదల చేసిన జీవోల లో ఒకటైన బందరు పోర్టు తెలంగాణ కు అప్పగించడం వంటి విషయాల్లో కొన్ని రహస్యంగా విడుదలైన తర్వాత ప్రజాహితం దృష్ట్యా ప్రభుత్వం వాటిని ఉపసంహరించుకుంది. కాబట్టి పారదర్శకత మాట అటుంచితే ప్రజలకు తెలియకుండా విడుదలైన ఈ 90 జీవోలను జగన్ ప్రభుత్వం ప్రజల మంచి కోసమే విడుదల చేసిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: