గ‌త ఆరు నెల‌ల‌కు ముందు ఏపీలో ఉన్న ప్ర‌భుత్వం టీడీపీ. దేశంలోనే సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. ఏపీలో అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి నిధుల లేమీతో కొట్టుమిట్టాడిన టీడీపీకి బ‌డ్జెట్ క‌ష్టాలు త‌ప్ప‌లేదు. అయితే చంద్ర‌బాబు త‌న పరిపాల‌నా అనుభ‌వాన్ని ఉప‌యోగించి, నిధులు ఎలా రాబ‌ట్టాలో ఆలోచ‌న చేశారు. అందుకే ఏపీలో నిధులు ప‌న్నుల రూపంలో రాబ‌ట్టేందుకు ఓ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి నాంధి ప‌లికారు. ఆ కార్య‌క్ర‌మాల‌తో నిధులు రాబ‌ట్టారు. దీనికి తోడు అప్పులు చేయ‌డం ష‌రామామూలే. 

 

అయితే చంద్ర‌బాబు ఏపీలో ముందుగా మ‌ద్యం ధ‌ర‌ల‌ను భారీగా పెంచి ఆధాయంకు మార్గం సుగుమ‌నం చేసుకున్నారు. దీనికి తోడు అమ‌రావ‌తి పేరుతో గ్రాఫిక్స్ రాజ‌ధాన్ని సృష్టించి రియ‌ల్ భూమ్‌కు తెర‌లేపాడు. దీంతో అటు అబ్కారి, ఇటు రియ‌ల్ ఎస్టేట్‌తో ప‌న్నుల‌ను బాగానే రాబ‌ట్టారు.. అయితే ప్ర‌తి స‌ర్కారుకు ఆధాయం వ‌చ్చే ప్ర‌ధాన వ‌న‌రు మ‌ద్యం అమ్మ‌కాలు. అందుకే మ‌ద్యంపై ప్ర‌భుత్వం అంత‌గా ఆధార‌ప‌డుతుంది. అయితే ఇక్క‌డ చంద్ర‌బాబు ఓడిపోయి జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చింది.

 

చంద్ర‌బాబు ఓడిపోయి జ‌గ‌న్ అధికారంలోకి రాగానే ఎన్నిక‌ల హామీల‌ను అమ‌లు చేసే దిశ‌గా ప‌య‌న‌మ‌య్యారు. అయితే ఎన్నిక‌ల హామీల్లో భాగంగా ఏపీలో ద‌శ‌ల వారిగా మ‌ద్య నిషేదం అమ‌లు చేస్తాన‌ని ఆడ‌ప‌డుచుల‌కు మాటిచ్చారు. మాటిచ్చిన ప్ర‌కారం ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌ద్యం అమ్మ‌కాల‌ను త‌గ్గించింది. దీనికి తోడు మ‌ద్యం కొనుగోల్లు త‌గ్గాల‌నే ఆలోచ‌న‌తో రేట్లు పెంచింది. 

 

అంతే కాదు మ‌ద్యం దుకాణాల‌ను ఏకంగా 800కు పైగా దుకాణాలను త‌గ్గించింది. అంతే కాదు బార్ల సంఖ్య‌ను బాగానే కుదించింది. మ‌ద్యం అమ్మ‌కాల‌ను త‌గ్గించాల‌నే ఆలోచ‌న‌తో స‌ర్కారు నేతృత్వంలోనే దుకాణాల‌ను నిర్వ‌హిస్తుంది. మ‌ద్య‌నిషేదం అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకుంది. రాబోవు ఐదేండ్ల‌లో మ‌ద్య దుకాణాలు లేకుండా చేయ‌డ‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ స‌ర్కారు క‌స‌ర‌త్తులు చేసింది. అందుకు త‌గిన విధంగా బెల్ట్‌షాపుల‌ను ర‌ద్దు చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏపీలో మ‌ద్యం అమ్మ‌కాలు లేని రాష్ట్రంగా చేయాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంక‌ల్పించింది. 

 

జ‌గ‌న్ ఏపీని మ‌ద్యాంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి మ‌ద్య‌ర‌హిత ప్ర‌దేశ్‌గా మార్చాల‌ని కంటున్న క‌ల‌లు సాకారం అయితే.. ఏపీలోని ఆడ‌ప‌డుచుల‌కు అంత‌కు మించిన వ‌రం ఏమి కావాలి. అందుకే జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యం ప‌ట్ల మ‌హిళ‌లోకం హ‌ర్షం వ్య‌క్తం చేస్తుంది. జ‌గ‌న్ ఆదాయం క‌న్నా.. ఆరోగ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌గా చూడాల‌నే కోరిక బ‌ల‌మైంది. అందుకే అటు వైపు వ‌డివ‌డిగా జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: