ప్రియాంక రెడ్డి హత్య కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.  ఎక్కడ చూసినా ప్రియాంక రెడ్డి గురించే మాట్లాడుకుంటున్నారు.  ఎవర్ని అడిగినా ప్రియాంక రెడ్డిని చంపినట్టుగానే నిందితులను కూడా కఠినంగా శిక్షించాలని అంటున్నారు.  ఒక్కరిని కూడా వదలొద్దని అంటున్నారు.  ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా సరే తాము చూసుకుంటామని చెప్తున్నారు. 
యావత్ భారతదేశం మొత్తం ప్రియాంక రెడ్డికి మద్దతుగా నిలిచింది.  కానీ, పోలీసులు మాత్రం ప్రియాంక రెడ్డి నిందితులను అతి జాగ్రత్తగా కాపాడి షాద్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి హైదరాబాద్ లోని చర్లపల్లి జైలుకు తరలించింది.  ఇలా జైలుకు భారీ భద్రత మధ్య తరలించడంతో పాటుగా, వారిని హై సెక్యూరిటీ సెల్ లో ఉంచడంతో నిందితులు హ్యాపీగా ఉన్నారు.  ఈ ఉదయం నుంచి జనాలు రోడ్డుపై కూర్చొని చేస్తున్న పోరాటం మాత్రం పోలీసులకు కనిపించడం లేదు.  
నిందితులను ఎన్ కౌంటర్ చేయాలనీ, లేదంటే బహిరంగంగా ఉరి తీయాలని అంటున్నారు.  ఇలా చేస్తేనే మరొకరు చేయడానికి భయపడతారని అంటున్నారు. అయితే, కొంతమంది మాత్రం మరికొన్ని విధానాలను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  ఎద్దుకు, పందికి, కుక్కకు ఎలాగైతే క్యాస్ట్రేషన్ చేస్తారో అదే విధంగా నిందితులకు కూడా క్యాస్ట్రేషన్ చేయాలనీ, అదే తగిన గుణపాఠం అని కొంతమంది అంటున్నారు.  నిందితులను చంపడం ఒక్కరే పరిష్కారం కాదని, ఇలా క్యాస్ట్రేషన్ చేయడం వలన వాళ్ళు జీవితంలో మరలా అలాంటి సంఘటనలకు పాల్పడలేరని.. భయం కలుగుతుందని అంటున్నారు. ఈ వాదన సరైనదే కానీ ప్రియాంక రెడ్డి విషయంలో ఇప్పుడున్న ఆగ్రహ జ్వాలల మధ్య ఇలాంటి విషయాలు ఏవి కూడా ప్రజల చెవికి ఎక్కవు.  ఆగ్రహంతో ఉన్నప్పుడు నిందితులను కఠినంగా శిక్షించాలి ఇదొక్కటే ప్రజల నోటి నుంచి వస్తుంది.  క్షణాల వ్యవధిలోనే హత్య అత్యాచారం చేసినపుడు.. శిక్ష విధించడం ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: