డాక్టర్ ప్రియాంక రెడ్డి  హత్య కేసులో సంచ‌ల‌నాల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. నిందితులను షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విచార‌ణ చేస్తున్న స‌మ‌యంలో...వారికి తమకు అప్పగించాలంటూ స్థానిక ప్రజలతో పాటు పెద్ద ఎత్తున జనం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకోవ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. అయితే, అక్క‌డి  నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. కాగా, ప్రియాంక హత్య కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వ‌చ్చాయి. 

 

ప్రియాంక హ‌త్య‌ను అత్యంత ప‌క‌డ్బందీగా చేశార‌ని తెలుస్తోంది. ప్ర‌ధాన నిందితుడు మహమ్మద్ అరిఫ్ ఆమె వాహ‌నాన్ని బాగు చేయిస్తాన‌ని చెప్పి ప్రియాంక రెడ్డి సెల్ నెంబర్ తీసుకున్నాడు. త‌న నంబ‌రు సైతం ఇచ్చాడు. అయితే, 15  నిమిషాలు అయినప్ప‌టికీ ప్రియాంక రెడ్డి తన మొబైల్ నుంచి మహ్మద్ అరిఫ్‌కి ఫోన్ కాల్ చేసింది. ఈ కాలే కీల‌కంగా మారింది. ప్రియాంక రెడ్డి నెంబర్ ఆధారంగా మహమ్మద్ అరిఫ్ ఆచూకీని పోలీసులు క‌నుక్కున్నారు. 

 

కాగా, దారుణ ఘ‌ట‌న‌కు ఒడిగ‌ట్టే స‌మ‌యంలో ప్రియాంక  హెల్ప్ హెల్ప్ హెల్ప్ అని వేడుకున్నప్ప‌టికీ నిందితులు కనికరించలేదు. బలవంతంగా ప్రియాంకా నోట్లో మద్యం పోసిన నిందితులు....ఆ తరువాత ఒకరి తరువాత ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. రాత్రి 9.30 నుండి 10.20 వరకు నిందితులు దారుణకాండ కొనసాగించారు. ముక్కు, నోరు మూయడంతో  అపస్మారక స్థితిలోకి ప్రియాంక రెడ్డి చేరింది. బాధితురాలిని ప్యాంట్ లేకుండానే లారీ క్యాబిన్‌లోకి దుండగులు ఎక్కించారు. లారీలోకి ఎక్కించి తరువాత, బాధితురాలి మృతదేహంపై కూడా కీచకులు అత్యాచారం చేసినట్లు తేలింది. లారీలో కూడా ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చేశారని తెలుస్తోంది. షాద్‌నగర్  బ్రిడ్జ్ కింద ప్రియాంకను దింపే సమయంలో ప్రియాంక  బతికి ఉంటుందన్న అనుమానంతో ఆమెపై దుండగులు పెట్రోల్ పోసి కాల్చి చంపినట్లు తేలింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: