ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంకు అవసరం అవ‌స‌రం. ఎందుకంటే నిత్యం బ్యాంకు నుంచి డబ్బు తీస్తూ ఉంటాం. ఇంకా బిజినెస్ వ్యవహారాలు న‌డిపే వారికి అయితే బ్యాంకుల్లో చెక్కులు డిపాజిట్ చేయ‌డం, డీడీలు జ‌మ చేయ‌డం వంటివి ఉన్నందున దాదాపు ప్రతి రోజు ముఖ్యమే. కొన్ని సందర్భాల్లో బ్యాంకు సెల‌వుల దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

                        

ఈ క్రమంలోనే ఈ నెల (డిసెంబర్)లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డిసెంబర్ నెలలోని రెండు, నాలుగో శనివారాలైన 14, 28 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఇకపోతే డిసెంబర్ నెల‌లో నాలుగు ఆదివారాలు కాదు ఈసారి ఐయుదు ఆదివారాలు వచ్చాయి. 1, 8, 15, 22, 29 తేదీల్లోను బ్యాంకులకు సెలవు.                        

                                     

కాగా వీటికి అదనంగా బ్యాంకు ఉద్యోగులకు మరో ఒక రోజు మాత్రమే సెలవు వచ్చింది. అది కూడా డిసెంబర్ 25వ తేదీ బుధువారం నాడు క్రిస్టమస్ పండుగ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. ఈ సెలువు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పనిచేస్తుంది. ఇకపోతే బ్యాంకులకు సెలవులు ఉన్నా కూడా నెట్ బ్యాంకింగ్ చేసేవారికి ఎటువంటి ఆటంకాలు ఉండ‌వు. ఆన్‌లైన్, డిజిటల్‌ లావాదేవీలు యథావిథిగా కొనసాగుతాయి. చూశారుగా డిసెంబర్ నెలలో 8 రోజులు బ్యాంకులకు సెలవలు ఉన్నాయి. కాబట్టి సెలవు లేని రోజు బ్యాంకు పనులు పెట్టుకోవడం మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: