మాన‌వ మృగాల వ‌లే ప్ర‌వ‌ర్తించిన డాక్ట‌ర్ ప్రియాంక రెడ్డి హంత‌కుల‌కు...14 రోజుల రిమాండ్ విధించిన సంగ‌తి తెలిసిందే. డాక్టర్ హత్య కేసులో నిందితులను షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌కు అటు నుంచి చర్లపల్లి జైలుకు పోలీసులు త‌ర‌లించారు. కాగా, నిందితుల‌ను షాద్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో విచారిస్తున్న స‌మ‌యంలో వారి ఫొటోలు ``ఏపీ హెరాల్డ్`` చేతికి చిక్కాయి. ఇదిగో ఇదే ఆ న‌ర‌రూప రాక్ష‌సుల గ్రూప్‌ ఫొటో. చూస్తే...అమాయ‌కుల వ‌లే ఉన్న‌ప్ప‌టికీ...ఈ న‌లుగురు కామాంధులే దారుణానికి ఒడిగ‌ట్టారు. అభంశుభం తెలియ‌ని ఆడ‌పిల్ల జీవితాన్ని అగ్నికి ఆహుతి చేసేశారు. 

 


ఇదిలాఉండ‌గా, నిందితుల‌ను క‌స్ట‌డీలోకి తీసుకుంటున్న స‌మ‌యంలో, జైల్లో వేస్తున్న‌ప్పుడు ఈ రెండు చోట్లా తీవ్ర  ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నిందితులను పోలీస్ స్టేష‌న్‌కు తీసుకు వ‌చ్చిన స‌మ‌యంలో...త‌క్ష‌ణ‌మే శిక్ష విధించేందుకు తమకు అప్పగించాలంటూ స్థానిక ప్రజలతో పాటు పెద్ద ఎత్తున జనం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. సంయమనంగా ఉండాలని విజ్ఞప్తి చేసినా నిరసనకారులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. దీంతో పోలీస్‌స్టేషన్ బయట తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. పోలీసులపైకి చెప్పులు విసరడం, పీఎస్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించిన ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.

అయితే, షాద్‌నగర్ తహసీల్దారు పాండు నాయక్ ఎదుట పోలీస్‌స్టేషన్‌లోనే ప్రియాంక హత్యకేసు నిందితులను పోలీసులు హాజరుపరిచారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వెనక దారి నుంచి మెజిస్ట్రేట్‌ను పోలీసులు స్టేషన్‌కు రప్పించారు. పీఎస్‌లోనే మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ నిందితులను విచారించారు. నిందితులకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. హంతకులను మహబూబ్‌నగర్ జైలుకు తరలించాల‌ని భావించిన‌ప్ప‌టికీ...షాద్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. అయితే, చర్లపల్లి జైలు దగ్గరకు కూడా చేరుకున్న కొంత మంది యువకులు నిందితులను తమకు అప్పగించాలంటూ ఆందోళనకు దిగారు. లేదంటే వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులతో యువకులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ జరిగింది. వారిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తన పోలీసులు మోహరించారు. కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: