ప్రియాంకారెడ్డి హత్య కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఓ అమాయకురాలు బలి అయిందని లోకమంతా కన్నీరు పెడుతోంది. దీనికి పాలకులు  సమాజం కూడా బాధ్యత వహించాలని ఓ వైపు అంతటా వినిపిస్తున్న మాట. మరో వైపు నేరాలపైన ప్రజలకు అవగాహన లేకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయ‌ని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ప్రియాంక కేసులో మరిన్ని నిజాలు ఇపుడు వెలుగు చూస్తున్నాయి.

 

ప్రియాంక  హత్య కేసుని ఛేదించిన పోలీసులు దానికి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో రాసిన సమాచారం బట్టి చూస్తే విస్తుబోయే నిజాలు వెలుగు చూశాయి.  బండి బాగు చేయిస్తానని  చెప్పిన ప్రధాన‌ నిందితుడు మహమ్మద్ అరీఫ్ స్కూటీని ప్రియాంక వద్ద నుంచి తీసుకెళ్ళినపుడు ఆమె తన బండిని ఎత్తుకెళ్తాడన్న అనుమానంతో అరీఫ్ నంబర్ ని అడిగి మరి తన ఫోన్లో సేవ్ చేసి పెట్టుకుంది.

 

ఆ తరువాత అఫీస్  ఎంతటికీ రాకపోవడంతో ఆ ఫోన్ నంబర్ నుంచే అతనికి ఫోన్ చేసినట్లుగా ఉన్న దాన్ని ప్రియాంక కాల్ డేటాలో పోలీసులు గుర్తించారు. దాని ఆధారంగానే ప్రధాన నిందితున్ని 24 గంటల వ్యవధిలో పట్టుకోగలిగారని తెలుస్తోంది. ఇక ప్రియాంకను మధ్యం తాగించి అత్యాచారం చేశారని  రిమాండ్ రిపోర్టులో పోలీసులు  పేర్కొన్నారు.

 

అదే విధంగా ఆమెను కామాంధులు అటాక్ చేసినపుడు ప్రియాంక హెల్ప్ హెల్ప్ అని అరచినా సమీపంలో ఎవరూ లేకపోవడం, వారు ఆమె నోరూ ముక్కూ మూసేయడంతోనే ఆమె చనిపోయిందని రిపోర్టులో రాశారు. ఇవన్నీ ఇలా ఉంటే ప్రియాంక ఫోన్ కాల్ తనని పట్టిస్తుందని ఊహించని మహమ్మద్ అరీఫ్ వాడి బ్యాచ్ ఆమెను తగులబెట్టేశారు. దానికి కూడా ఆమె ఇంకా బతికి ఉందేమోనని అనుమానంతోనే కాల్చారని కూడా పోలీసుల రిమాండ్ రిపోర్టులో రాశారు. మొత్తానికి ఒక అమాయకురాలు బలి అయిపోయినా ఆమె ఫోన్  ద్వారా వెళ్ళిన కాల్ డేటా వారిని పట్టించేసింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: