దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులకు మెజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు నలుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించగా అక్కడ వీరికి ఖైదీ నంబర్లు కేటాయించారు. రిమాండ్ రిపోర్టులో మహ్మద్ అరీఫ్ వైద్యురాలి సెల్ ఫోన్ నంబర్ టైర్ పంక్చర్ వేయిస్తానని చెప్పి తీసుకున్నాడని అరీఫ్ ఎంతకూ రాకపోవడంతో ప్రియాంక అరీఫ్ కు ఫోన్ చేసిందని ఫోన్ కాల్ ఆధారంగా అరీఫ్ అడ్రస్ ను పోలీసులు ట్రేస్ చేశారని తెలుస్తోంది. 
 
గట్టిగా ముక్కు, నోరు మూయడంతో ప్రియాంక అపస్మారక స్థితిలోకి వెళ్లిందని ప్రియాంకపై అత్యంత దారుణంగా నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. షాద్ నగర్ బ్రిడ్జి దగ్గర కిందకు దించే సమయంలో ప్రియాంక బతికి ఉందనే అనుమానంతో నిందితులు ప్రియాంకను కాల్చి చంపినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. 
 
ఈ కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆ నలుగురు మృగాళ్లను బహిరంగంగా ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని కూడా ప్రజల నుండి డిమాండ్ వినిపిస్తోంది. నిందితులను ఎక్ కౌంటర్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 
 
ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితుల తల్లిదండ్రులు, గ్రామస్థులు నిందితులు చేసిన తప్పు వలన మా గ్రామం మొత్తానికి చెడ్డ పేరు వస్తోంది. తప్పు చేసిన నిందితులను గ్రామంలోనే బహిరంగంగా ఉరి తీయాలి అని డిమాండ్ చేశారు. ప్రియాంక హత్య కేసులో నిందితుడైన చెన్నకేశవులు తల్లి ప్రియాంకను ఎలా చంపారో నా కొడుకును అలానే చంపండని చెప్పింది. ప్రధాన నిందితుడైన మహ్మద్ అరీఫ్ తల్లి నన్ను, నా కొడుకును శిక్షించండి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నిందితులలో ఒకడైన శివ తల్లి నా కొడుకు అలాంటి వాడు కాదని క్లీనర్ పని మానేయమని చెబితే జీతం తీసుకొనివస్తానని చెప్పి కంపలో పడ్డాడని చెప్పింది. నవీన్ తల్లి లక్ష్మి చిన్నప్పుడే మొగుడు చనిపోయాడని కొడుకు పాడు పని చేసి జైలుపాలయ్యాడని చెప్పింది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: