నరేంద్ర మోదీ ప్రభుత్వం ఫాస్టాగ్ తప్పనిసరి అనే డెడ్ లైన్ ను డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగించింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఫాస్టాగ్స్ పొందేందుకు వాహనదారులకు మరింత గడువు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని డిసెంబర్ 15వ తేదీ వరకు ఫాస్టాగ్స్ తీసుకోవచ్చని పేర్కొంది. కేంద్రం ఇప్పటివరకు 70లక్షలకు పైగా ఫాస్టాగ్స్ జారీ జరిగిందని చెబుతోంది. ఫాస్టాగ్ కు ఐదేళ్ల వాలిడిటీ ఉంటుంది. ఒకసారి ఫాస్టాగ్ తీసుకుంటే ఐదేళ్లు ఆ ఫాస్టాగ్ పని చేస్తుంది. 
 
యాక్సిస్ బ్యాంక్ ఇంటివద్దకే ఉచితంగా ఫాస్టాగ్ లను పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. యాక్సిస్ బ్యాంకు ఈ సౌకర్యాన్ని తమ బ్యాంకు ఖాతాదారులకు మాత్రమే కాకుండా ఇతర బ్యాంకుల ఖాతాదారులకు కూడా ఈ సౌలభ్యాన్ని అందిస్తున్నట్లు చెబుతోంది. యాక్సిస్ బ్యాంక్ ఫాస్టాగ్ కోసం ఆన్ లైన్లో లేదా యాక్సిస్ బ్యాంకు శాఖల్లోను ధరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 
 
యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులను వినియోగించి రీఛార్జ్ చేసుకుంటే 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చని యాక్సిస్ బ్యాంక్ పేర్కొంది. ఫాస్టాగ్ అనేది ఒక రీలోడబుల్ స్టిక్కర్. ఫాస్టాగ్ ను వాహనం ముందు అద్దానికి అతికిస్తారు. ఫాస్టాగ్ వలన టోల్ ప్లాజాలోకి వాహనం ప్రవేశించిన వెంటనే టోల్ ఛార్జీల చెల్లింపు ఆటోమేటిక్ గా పూర్తవుతుంది. వాహనదారులు టోల్ ఛార్జీల చెల్లింపు కోసం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. 
 
ఈ విధానం ద్వారా టోల్ ఫీజు చెల్లింపు సందర్భంగా జరుగుతున్న జాప్యాన్ని తగ్గించటంతో పాటు నిమిషం కన్నా తక్కువ సమయంలో వాహనం వెళ్లిపోయేందుకు వీలవుతుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మాట్లాడుతూ 23 బ్యాంకుల ద్వారా ఫాస్టాగ్ చిప్ లు అందిస్తున్నామని డిసెంబర్ 15వ తేదీ తరువాత టోల్ గేట్ల వద్ద నగదు లావాదేవీలకు ఒక లైన్ మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: