వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి అత్యాచారం, హత్య ఘటన తెలంగాణనే కాదు.. దేశాన్నే కదలిస్తోంది. అనేక రూపాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ దారుణ ఘటనపై హైదరాబాద్ శివార్లలో చాలా ప్రసిద్ధి చెందిన చిలుకూరు ఆలయ యాజమాన్యం కూడా స్పందించింది. ప్రియాంక రెడ్డి దారుణ ఘటనకు నిరసనగా శనివారం రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మూసేశారు.

 

 

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిపై నలుగురు కీచకులు అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని శనివారం ఉదయం 11 గంటల నుంచి 20 నిమిషాల పాటు ప్రదక్షణలు, దర్శనాలను పూర్తిగా నిలిపేశారు. ఆ తర్వాత ఆలయం ఎదుట భక్తులతో మహా ప్రదక్షణ చేయించారు.

 

 

రక్షిద్దాం.. రక్షిద్దాం.. స్త్రీజాతిని రక్షిద్దాం అంటూ భక్తులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ భక్తులు మహాప్రదక్షణ చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత చిలుకూరు ఆలయ అర్చకుడు రంజరాజన్ మాట్లాడారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగకపోవడంపై చిలుకూరు ఆలయ అర్చకుడు రంజరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదని ఆవేదన చెందారు.

 

 

నేటి సమాజంలో... నెలల పాప నుంచి కాటికి కాలు చాచిన వృద్ధుల వరకూ మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు చిలుకూరు ఆలయ అర్చకుడు రంజరాజన్. అందుకే దేశంలో మహిళలు సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించామని చిలుకూరు ఆలయ అర్చకుడు రంజరాజన్ తెలిపారు. చిలుకూరు ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం.. సాధారణ ఆలయాల మాదిరిగా ఇక్కడ హుండీలు ఉండవు. అసలు డబ్బు ప్రస్తావనే ఉండదు. వీఐపీలకు ప్రత్యేక దర్శనాలు అస్సలు ఉండవు. ఎలాంటి ఫీజులు ఉండవు.

మరింత సమాచారం తెలుసుకోండి: