దేశం వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి హత్య కేసు లో నలుగురు నిందితులను పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య చర్లపల్లి జైలు కు తరలించారు. నిందితులను జైలుకు తీసుకు వెళ్లేముందు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

 

ముందే దొరికారు కానీ వదిలేసారు

 

నిందితులు ఆరిఫ్ మరియు మరియు శివ నవంబర్ నవంబర్ 21వ తారీకున కర్ణాటకలోని రాయచూర్ కు ఇనుప కడ్డీలా లోడ్ ను తీసుకువెళ్లారు. లోడ్ చేసిన ఇనుప కడ్డీల్లో కొన్నింటిని దొంగతనం చేసి మార్గం మధ్యలో చెట్ల పొదల మాటున దాచారు. రాయచూర్ లో అన్లోడ్ చేసాక లారీ యజమాని శ్రీనివాస రెడ్డి ఆదేశం మేరకు గంగావతి వెళ్లి ఇటుకలను లోడ్ చేసుకుని ఆరిఫ్ తన స్నేహితులైన నవీన్ మరియు చెన్నకేశవులు ఇద్దరిని గుడిగండ్ల గ్రామంలో ఎక్కించుకున్నారు. దొంగతనం చేసిన ఇనుప కడ్డీలను అమ్మి రూ 4 వేలు సంపాదించారు నిందితులు. 

 

ఈ నేపథ్యంలో నవంబర్ 26 న మహబూబునగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద లారీ ని ఆర్టీఓ అధికారులు ఆపి లారీ ని తనిఖీ చేసి డ్రైవర్ ఆరీఫ్ కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని, లారీ ఓవర్ లోడ్ తో ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో కంగారుపడ్డ ఆరీఫ్ ఓనర్ శ్రీనివాస రెడ్డి కి ఫోన్ చేసి లారీ ని ఆర్టీఓ అధికారులు పట్టుకున్నారు అని చెప్పగా శ్రీనివాస రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో లారీ ని ఆర్టీఓ అధికారులకు అప్పగించొద్దని ఆరీఫ్ కు చెప్పాడు. దీనితొ ఆరీఫ్ లారీ సెల్ఫ్ మోటార్ వైర్ ని పీకేసాడు లారీ ని తీసుకువెళ్లేందుకు ఆర్టీవో అధికారులు ప్రయత్నించగా లారీ ఎంతకూ స్టార్ట్ కాకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లారు. 

 

ఆ తరువాతి రోజు ఉదయం నిందితులు తొండుపల్లి రోడ్డు పక్కన నిలుపగా అక్కడున్న పోలీసులు రోడ్డు పక్కనుంచి తీసేయాలని సూచించారు దీనితో లారీ ని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ప్లాజా వద్ద పార్క్ చేశారు నిందితులు ఇక అదే రోజు సాయంత్రం ఇనుప కడ్డీలు అమ్మిన డబ్బులతో మద్యం సేవించి అతి కిరాతకంగా ప్రియాంక రెడ్డి ని హతమార్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: